SANKASTHAHARA GANESHA VRATAM HELD _ క‌పిల‌తీర్థంలో సంకష్టహర గణేశ వ్ర‌తం

Tirupati, 4 Dec. 20: As part of Karthika Masa Deeksha, Sankastha Hara Ganesha vratam held at Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

Speaking on the occasion, Vedic Scholar Sri Pavana Kumara Sharma said, Chaturthi Tithi is important for Lord Ganesh that too the one which occurs after Karthika Pournami.

The Vratam held with utmost devotion between 8:30am and 9:30am.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌పిల‌తీర్థంలో సంకష్టహర గణేశ వ్ర‌తం
 
తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 04: కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా శుక్రవారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో శ్రీ సంకష్టహర గణేశ వ్ర‌తం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
 
ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌నకుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. చతుర్థి తిథికి అధిపతి గణపతి అని, కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి నాడు ఈ వ్రతం నిర్వహించడం ఎంతో విశేషమని అన్నారు. వినాయకుడు సమస్తమైన ఆపదలు తొలగించి, కలియుగంలో శీఘ్రంగా ఫలాన్ని అనుగ్రహిస్తారని వివరించారు.
 
ముందుగా పార్వతి పరమేశ్వరులు, వినాయకుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు.  సంక‌ల్పంతో వ్రతాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ వ్ర‌తం ముగిసింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.