SARASWATI AVATAR SHOWERS WISDOM _ హంస‌ వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామి

Tirupati, 19 May 2021: The second day evening on Wednesday witnessed Sri Govindaraja Swamy in Saraswati Avatara as a part of the ongoing annual brahmotsavams Sri Govindaraja Swamy Temple at Tirupati.

In view of covid-19 Seva has been observed in Ekantam.

Special Grade Deputy EO Sri Rajendrudu and other temple officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస‌ వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామి

తిరుప‌తి, 2021 మే 19: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు హంస వాహనంపై సరస్వతి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

హంస వాహనసేవలో శ్రీగోవిందరాజస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఏ.టి. శ్రీనివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.