SARVABHOOPALA VAHANAM HELD _ స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిస్వామి అభయం

Tirupati, 20 June 2024: Sarvabhoopala Vahana seva was held in Appalayagunta annual fest on thursday evening.

Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi send His graceful blessings to the devotees.

AEO Sri Ramesh and other temple staff were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిస్వామి అభయం

తిరుపతి, 2024 జూన్ 20: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంట‌లకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

వాహ‌న సేవ‌లో ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.