SAVE ELECTRICAL ENERGY IN TTD-EO _ టిటిడిలో మరింత పటిష్టంగా విద్యుత్‌ ఆదా చర్యలు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

TIRUPATI, 19 JANUARY 2023: To save the consumption of electrical energy in TTD, the EO  Sri AV Dharma Reddy directed the concerned officials to find a mechanism and come out with an action plan for the same.

 

A meeting with the officials of AP State Conservation Mission(APSCM) and Non-conventional Energy Development Corporation of AP (NEDCAP) along with TTD Engineering department in the EO chamber at TTD Administrative Building in Tirupati on Thursday.

 

The EO said, new equipment with the latest technology to save the consumption of Electrical Energy is being installed in all the departments in TTD. He said the APSCM will replace the 100 old water pipes located in Pumping stations with new ones under ESCO (Energy Services Company). TTD is not investing a single penny over this project from its funds. Similarly, NEDCAP will provide a solar steam cooking system in the Annaprasadam wing of TTD to save the cooking gas. TTD has entered an MoU with these institutions under ESCO model. 

 

CE Sri Nageswara Rao, APSCM CEO Sri Chandrasekhar Reddy, NEDCAP GM Sri Jagadeeshwar Reddy, Area Manager Sri Anjaneyulu Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy DE Sri Ravishankar Reddy, Water Works EE Sri Srihari were also present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడిలో మరింత పటిష్టంగా విద్యుత్‌ ఆదా చర్యలు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
తిరుపతి, 2023 జనవరి 19: టిటిడిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో ఎపిఎస్‌ఇసిఎం(ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌), నెడ్‌క్యాప్‌(నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి) సంస్థల అధికారులతో గురువారం ఈవో సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యుత్‌ ఆదా చర్యల్లో భాగంగా అన్ని విభాగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎపిఎస్‌ఇసిఎం సంస్థ ESCO(ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ) తరహాలో టిటిడిలోని తాగునీటి పంపింగ్‌ స్టేషన్లలో గల 100 పాత పంపు సెట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనుందన్నారు. నెడ్‌క్యాప్‌ సంస్థ ఆధ్వర్యంలో టిటిడిలో అన్నప్రసాదాల తయారీకి సోలార్‌ స్టీమ్‌ కుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా వంటగ్యాస్‌ ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు సదరు సంస్థల అధికారులతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
 
ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, ఎపిఎస్‌ఇసిఎం సిఈవో శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, నెడ్‌క్యాప్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఏరియా మేనేజర్‌ శ్రీఆంజినేయులురెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, వాటర్‌ వర్క్స్‌ ఇఇ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.