SBI CHIEF CALLS ON TTD CHAIRMAN _ టిటిడి డిపాజిట్ల‌పై ఎక్కు‌వ వ‌డ్డీ ఇవ్వండి ఎస్‌బిఐ ఛైర్మ‌న్ శ్రీ దినేష్ కుమార్ ఖారాను కోరిన‌ టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 29 Nov. 20: TTD Chairman Sri YV Subba Reddy on Sunday sought the SBI Chairman Sri Dinesh Kumar Khurana to facilitate the TTD with higher interest rates on its Fixed Deposits.

The SBI Chairman and other SBI officials called on the TTD Chairman at the latter’s camp office in Tirumala on Sunday.

During the meet, the TTD Chairman said reduced interest rates on bank deposits during lockdown period had cast a negative impact on TTD fixed deposits.

Since the situation is slowly back to normalcy, the SBI should treat the TTD as a special case in view of its widespread socio-economic and religious – welfare activities and provide higher interest rates.

The SBI chairman responded favourably to look into the TTD appeal.

Chief GM of SBI of Amaravati circle Sri Sanjay, Deputy GM Sri S Giridhar, Assistant GM Sri Satyanarayana Rao were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి డిపాజిట్ల‌పై ఎక్కు‌వ వ‌డ్డీ ఇవ్వండి

ఎస్‌బిఐ ఛైర్మ‌న్ శ్రీ దినేష్ కుమార్ ఖారాను కోరిన‌ టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల‌, 2020 నవంబరు 29: టిటిడి డిపాజిట్ల‌పై ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఏర్పాటు చేయాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ శ్రీ దినేష్ కుమార్ ఖారాను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కోరారు. ఆదివారం తిరుమ‌లలోని ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఎస్‌బిఐ ఛైర్మ‌న్ ఇత‌ర అధికారులు టిటిడి ఛైర్మ‌న్‌ను క‌లిశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న ఎస్ బి ఐ చైర్మన్ కు శ్రీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌-19 నేప‌థ్యంలో బ్యాంకులు డిపాజిట్ల‌పై వ‌డ్డీని త‌గ్గించ‌డంతో టిటిడి డిపాజిట్ల మీద ఈ ప్ర‌భావం ప‌డింద‌న్నారు. ప్ర‌స్తుతం బ్యాంకులు సాధార‌ణ ప‌రిస్థితుల‌కు చేరుకుంటున్నందువ‌ల్ల వ‌డ్డీ విష‌యంలో టిటిడిని ప్ర‌త్యేకంగా ప‌రిగ‌ణించి డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ వ‌చ్చేలా చూడాల‌ని కోరారు. టిటిడి ధార్మిక కార్య‌క్ర‌మాల‌తోపాటు సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నందువ‌ల్ల ఈ ప్ర‌తిపాద‌న వీలైనంత త్వ‌ర‌గా ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీ సుబ్బారెడ్డి ఎస్‌బిఐ ఛైర్మ‌న్‌ను కోరారు. ఈ ప్రతిపాదనకు ఎస్ బి ఐ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.

టిటిడి ఛైర్మ‌న్‌ను క‌లిసిన‌వారిలో ఎస్‌బిఐ అమ‌రావ‌తి స‌ర్కిల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ సంజ‌య్‌, డెప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ ఎస్‌.గిరిధ‌ర్‌, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ స‌త్య‌నారాయ‌ణ రావు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.