SCRAPING OF CATEGORIES IN VIP BREAK YIELDING GOOD RESULTS-SPECIAL OFFICER_ సామాన్య భక్తుల సౌకర్యం కోసమే బ్రేక్ దర్శనం కేటగిరీల రద్దు – ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి
Tirumala, 2 August 2019: The scraping of List 1, List 2, List 3 categories in VIP Break Darshan tickets has resulted in the provision of darshan to common pilgrims by an hour.
Speaking to media persons at Annamaiah Bhavan, the Special Officer of Tirumala, Sri AV Dharma Reddy said, the TTD Trust Board Chairman Sri YV Subba Reddy had announced that the common pilgrims will be given priority in darshan and accordingly changes have been brought in reducing VIP break darshan by cancelling categories from July 18 on wards.
Even the protocol VIPs are now given Theertham and Satari outside the sanctum which has saved lot of time and today we could able to complete VIP break darshan in short time. With this scraping of categories in VIP break, now almost an hour is saved and in this precious hour we could be able to provide darshan to nearly 4500-5000 pilgrims in addition”, he observed.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సామాన్య భక్తుల సౌకర్యం కోసమే బ్రేక్ దర్శనం కేటగిరీల రద్దు – ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి
తిరుమల, 2019 ఆగష్టు 02: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనంలో ఉన్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలను రద్దు చేశామని, జూలై 18వ తేది నుండి నూతన విధానం అమలవుతోందని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి సూచన మేరకు బ్రేక్ దర్శనంలో కేటగిరీలను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు తీర్థం, శఠారి స్నపనమండపంలో ఇస్తున్నామని, తద్వారా సమయం ఆదా అవుతోందని వివరించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు పేష్కార్ ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం కల్పించడం 1800 సంవత్సరం నుండే అమలవుతున్నట్లు అప్పటి దిట్టం ద్వారా తెలుస్తోందన్నారు. బ్రేక్ దర్శనంలో కేటగిరీలను రద్దు చేయడం వల్ల గంట సమయం ఆదా అవుతోందని, తద్వారా దాదాపు 5,000 మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతోందన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని మీడియా ప్రతినిధులను కోరారు.
ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.