ANNUAL BRAHMOTSAVAMS AT TIRUMALA FROM SEP 30 TO OCT 8_ సెప్టెంబర్‌ 30 నుండి అక్టోబర్‌ 8 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala, 2 August 2019: The annual brahmotsavams in Tirumala will be observed from September 30 till October 8 said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media persons after the Dial your EO programme at Annamaiah Bhavan on Friday in Tirumala, the EO said, the important days includes Dhwajarohanam on September 30, Garuda Seva on October 4, Rathotsavam on October 7 and Chakrasnanam on October 8.

He said the important events like annual Pavitrotsavams at Tirumala will be observed from August 11 to 13, Varalakshmi Vratam at Tiruchanoor on August 9, Sravana Pournami Managudi from August 9 to 15 in the selected temples in AP and TS.

The EO also said, a trial-run of jute bags to carry laddus was done which has received a good response from the pilgrims. The Jute Board or the Jute Corporation of India are ready to commence the sale of jute bags from the third week of August in Tirumala, he added.

He said this year, the month of July bettered the figures of Darshan, Accommodation, distribution of Laddus, Annaprasadam, Kalyanakatta and Hundi Collection than the previous year’s record.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 2019 ఆగష్టు 02: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్‌ 30 నుండి అక్టోబర్‌ 8 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు :

– సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేస్తాం.

– సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ముఖ్యంగా….

సెప్టెంబరు 30న – ధ్వజారోహణం,

అక్టోబరు 4న – గరుడవాహనం,

అక్టోబరు 5న- స్వర్ణరథం,

అక్టోబరు 7న – రథోత్సవం,

అక్టోబరు 8న- చక్రస్నానం, ధ్వజావరోహణం.

ప్రత్యేక దర్శనాలు :

– ఆగస్టు 13, 27వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు,

– ఆగస్టు 14, 28వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

ఆగస్టు 11 నుండి 13 వరకు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు :

– ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 10న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ఆగస్టు 9న శ్రీవరలక్ష్మీ వ్రతం :

– ఆగస్టు 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఈ సందర్భంగా తిరుచానూరులో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేస్తాం.

మనగుడి :

– ఆగస్టు 9 నుండి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలోని 23 జిల్లాలలో ఎంపిక చేసిన ఆలయాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం.

ఆగస్టు 23న గోకులాష్టమి :

– ఆగస్టు 23న తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోపూజ, గోకులాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.

తిరుమలలో నీటి నిల్వ :

– తిరుమలలో నీటి నిల్వ మరియు కల్యాణిడ్యాం, బోర్‌ వెల్స్‌ అన్నింటిని కలుపుకుని 124 రోజుల వరకు సరిపడ నీరు అందుబాటులో ఉంది.

జనపనార బ్యాగులు

– తిరుమలలో జూలై 24,25,26 తేదీలలో ప్రయోగాత్మకంగా జనపనార బ్యాగులను భక్తులకు పంపిణీ చేశాం.

– భక్తుల నుండి మంచి స్పందన లభించింది. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో ఈ బ్యాగులను ఆగష్టు మూడో వారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తాం.

దర్శనం :

– గతేడాది జూలైలో 23.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జూలైలో 23.82 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూలైలో రూ.102.88 కోట్లు కాగా, ఈ ఏడాది జూలైలో రూ.109.60 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది జూలైలో57.32 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూలైలో 61.27 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

– గతేడాది జూలైలో 99.81 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూలైలో 1.14 కోట్ల లడ్డూలను అందించాం.

గ‌దులు :

– గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది జూలైలో 104 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది జూలైలో 106 శాతం న‌మోదైంది.

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇంఛార్జీ సీఈ శ్రీ రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.