SEP 12-14 PAVITROTSAVAMS AT SRI PAT_ సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Tiruchanoor 25 Aug 19; TTD plan to conduct Pavitrotsavam at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor from September 12-14 and Ankurarpanam on September 11th evening.

Interested devotees could participate in the Pavitrotsavam on all three days with ₹750 ticket for each one will get two laddus and two vadas as Prasadam.

TTD proposes to conduct Koil Alwar Thirumanjanam at Sri Padmavathi ammavari temple on September 10th.

In view of the Koil Alwar thirumanjanam event, TTD has cancelled, Kalyanotsavam and Unjal Seva on September 10th and on September 11th Ankurarpanam will be held and Kalyanotsavam and Unjal Seva and Break Darshan will be cancelled.

On September 12th Thiruppavada Seva, Kalyanotsavam, Unjal Seva will be cancelled.

On September 13, Abhisekaanantra darshanam, Break Darshanam and Lakshmi Pooja, Kalyanotsavam and Unjal Seva will be cancelled.

On Sep 14 due to pavitrotsavam last day Morning Break Darshanam, Kalyanotsavam and Unjal Seva will be cancelled.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 ఆగస్టు 25: సిరులతల్లి తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 11వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మ త్సంగ్రాహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 12వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 13న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 14న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గ హస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 11వ తేదీన అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవల, బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబరు 12వ తేదీ గురువారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 13న రెండో రోజు శుక్రవారం అభిషేకానంతర దర్శనం, ఉదయం బ్రేక్‌ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 14న పవిత్రోత్సవాల్లో చివరిరోజు శనివారం ఉదయం బ్రేక్‌ దర్శనం, కల్యాణోత్సవం మరియు ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది.

సెప్టెంబరు 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

అనంతరం ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.