SEPTEMBER 27- OCT 5 NAVARATRI FETE AT SRI KAPILESWARA SWAMY _ సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు

Tirupati, 15 September 2022: TTD is organising grand Sri Kamakshi Ammavari Sharannavaratri celebrations at Sri Kapileswara Swamy temple from September 27 to October 5.

 

During the nine-day fete the presiding deity Sri Kamakshi Ammavaru will bless devotees in different alankarams every day.

 

In view of ensuing festivities and as part of traditions, the Koil Alwar Tirumanjanam (temple cleansing) fete will be performed on September 23. The kalasha sthapana and Ankurarpanam fetes are done on September 26.

 

Prominent among alankarams will be Sri Kamakshi devi on Sept. 27, Sri Aadi Parashakti on September 28, Mavadi Seva Alankaram on September 29, Sri Annapurna Devi on September 30, Sri Mahalakshmi on October 1, Sri Saraswati on October 2,Sri Durga Devi on October 3, Sri Mahishasura Mardini on October 4 and finally Sri Shivaparvatula alankaram on Oct. 5 on the day of Vijay Dashami.

 

TTD is also organising cultural programs like devotional music, religious discourses on Devi Bhagavatham, Lalita Sahasranama Parayanams by the artists of HDPP and Annamacharya project during the fete.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు

 తిరుపతి, 2022 సెప్టెంబరు 15: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 23వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26న క‌ల‌శ‌స్థాప‌న‌, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబరు 27న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 28న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 29న మావ‌డిసేవ అలంకారం, సెప్టెంబరు 30న
శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 1న శ్రీ మ‌హాల‌క్ష్మి, అక్టోబరు 2న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 3న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 4న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబ‌రు 5న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా శ్రీ శివ‌పార్వ‌తుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.