SRIVARI ANNUAL BRAHMOTSAVAM WITH PILGRIM PUBLIC PARTICIPATION AFTER TWO YEARS-TTD EO _ రెండు సంవత్సరాల తర్వాత భక్తుల భాగస్వామ్యంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ANTICIPATING HEAVY TURNOUT THIS YEAR

INSPECTS ENTRY AND EXIT POINTS IN FOUR MADA STREETS 

Tirumala, 15 September 2022: All the departments of Tirumala Tirupati Devasthanams are gearing up to host the mega religious festival annual brahmotsavams this year, which is scheduled between September 27 to October 5, said TTD EO Sri AV Dharma Reddy.

 

After inspecting the various Entry and Exit points in the four mada streets along with the TTD Chief Vigilance and Security Officer, Sri Narasimha Kishore on Thursday in Tirumala, the EO talking to media persons said, TTD is all set to observe the annual festival in a big way this year and is anticipating a huge turnout of pilgrim public for all the vahana sevas besides Garuda Seva which is scheduled on October 1 this year.

 

“Last two years, Brahmotsavams were observed in Ekantam inside the temple due to Covid Pandemic restrictions. So this year we are expecting a huge crow pull”, he observed. 

 

“To ensure no inconvenience is caused to the multitude of visiting pilgrims, both our vigilance and district collector and police have inspected the four mada streets and galleries a couple of times already along with Engineering department. During the inspection today, we have even visited the Ragi Manu area and assessed on how to keep the entire area as buffer zone to hold pilgrim devotees on the day of Garuda Seva”, he added. 

 

As this year, heavy turn out of pilgrims is being anticipated, the EO urged the pilgrims to have hassle-free darshan with patience and extend their co-operation to TTD.

 

SE 2 Sri Jagadeeshwar Reddy, VGOs Sri Bali Reddy, Sri Manohar, Engineering officials, AVSOs, VIs, Tirumala police officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రెండు సంవత్సరాల తర్వాత భక్తుల భాగస్వామ్యంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

– భారీ సంఖ్యలో విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు

– నాలుగు మాడ వీధులను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 15: టీటీడీలోని అన్ని విభాగాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమలలో గురువారం టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌తో కలిసి నాలుగు మాడ వీధుల్లోని వివిధ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పెరటాసి మాసం మరియు అక్టోబరు 1న గరుడ సేవతో పాటు అన్ని వాహన సేవలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

“గత రెండు సంవత్సరాలు, కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా ఆలయం లోపల ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ స్వామివారి వాహన సేవ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని” సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.

“బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, టీటీడీ విజిలెన్స్, జిల్లా కలెక్టర్ మరియు పోలీసులు ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంతో కలిసి నాలుగు మాడ వీధులు, గ్యాలరీలను రెండుసార్లు తనిఖీ చేశారన్నారు. ఈ రోజు తనిఖీ సందర్భంగా, తాను కూడా అన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున రాగి మాను ప్రాంతంలో భక్తులను ఉంచడానికి బఫర్ జోన్‌గా ఎలా ఉంచాలనే దానిపై పరిశీలించినట్లు ” ఆయన తెలిపారు.

ఈ సంవత్సరం, భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఓపికతో వేచి ఉండి దర్శనం చేసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్, ఇంజినీరింగ్ అధికారులు, ఏవీఎస్‌వోలు, వీఐలు, తిరుమల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.