SERVE DEVOTEES WITH DEDICATION- ADDL EO TO DEPUTATION STAFFS AND SEVAKULU _ ర‌థ‌స‌ప్త‌మినాడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భక్తులకు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 18 February 2021: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy called upon the TTD deputation staff and Srivari Sevakulu to render service with service motto and dedication to devotees waiting in galleries of Mada streets to witness the Ratha Sapthami vahana sevas at Tirumala on Friday.

Addressing an awareness meeting of Srivari Sevakulu at Srivari Seva Sadan-2 and for deputation staff at Annaprasada Bhavan on Thursday evening, he said both TTD employees and Srivari Sevakulu should function in coordination and disciplined way and also adhere to Covid-19 guidelines without fail by wearing masks and advising devotees in galleries also to keep wearing masks.

He said they should advise the devotees to fill up water from Jala Prasadam taps nearby in the water bottles provided to them whenever needed. The devotees should also be apprised of location of toilets, drinking water sources etc during the day-night long Vahana sevas on Mada streets.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ర‌థ‌స‌ప్త‌మినాడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భక్తులకు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021, ఫిబ్రవరి 18: రథసప్తమినాడు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి డెప్యుటేష‌న్‌ సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో సేవలందించాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో డెప్యుటేష‌న్ సిబ్బందికి, శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌-2లో శ్రీ‌వారి సేవ‌కుల‌కు గురువారం అవగాహన సమావేశాలు నిర్వహించారు. టిటిడి అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీ‌వారిసేవ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలని కోరారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ మాస్కులు ధ‌రించాల‌ని, భ‌క్తులు కూడా ధ‌రించేలా తెలియ‌జేప్పాల‌ని కోరారు. గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తులంద‌రికీ తాగునీటి బాటిల్ అందిస్తామ‌ని, అది ఖాళీ అవ‌గానే తిరిగి అక్క‌డే ఉన్న కొళాయిల్లోని జ‌ల‌ప్ర‌సాదం నీటిని నింపుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. గ్యాల‌రీల్లో చివ‌ర ఉన్న భ‌క్తులకు కూడా తాగునీరు, అన్న‌పానియాలు అందేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. అందుబాటులో ఉన్న మ‌రుగుదొడ్ల గురించి భ‌క్తుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. శ్రీ‌వారి సేవ‌కుల సాయం‌తో చ‌క్క‌గా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌న్నారు. ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని కోరారు. ఏవైనా స‌మ‌స్య‌లు ఎదురైతే అందుబాటులో ఉన్న అధికారుల‌ను వెంట‌నే సంప్ర‌దించి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.

ఈ స‌మావేశాల్లో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి, శ్రీ‌వారి సేవా సెల్ ఏఈవో శ్రీ ర‌మాకాంత‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.