ADDITIONAL EO INSPECTS ARRANGEMENTS IN MADA STREETS _ గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో

Tirumala, 18 February 2021:  Ahead of the Ratha Sapthami festivities on Friday, the TTD Additional EO Sri AV Dharma Reddy, made a spot inspection of the arrangements at the four Mada streets on Thursday. 

During his inspection, the Additional EO made several suggestions to the Engineering, Annaprasadam, Vigilance and Health officials to ensure a hassle-free facilitation for devotees coming for witnessing all the Seven Vahana sevas tomorrow.

He suggested them to take all precautions for the supply of drinking water, distribution of Annaprasadam, sanitation of toilets and cleaning up of garbage all along Mada streets.

TTD SE-2 Sri Nageswara Rao, DyEOs Sri Harindranath, Sri Nagaraja, Health officer Dr R R Reddy, VGO Sri Bali Reddy, Catering officer Sri GLN Shastri, AVSO Sri Gangaraju and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో

తిరుమల, 2021, ఫిబ్రవరి 18: తిరుమలలో శుక్రవారం రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తనిఖీ చేశారు.

వాహనసేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరిగేలా జాగ్రత్తలు వహించాలని టిటిడి ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, విజిలెన్స్‌ విభాగాల అధికారులకు అద‌న‌పు ఈవో పలు సూచనలు చేశారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ, మ‌రుగుదొడ్ల వ‌ద్ద పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

అద‌న‌పు ఈవో వెంట టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి, ఎవిఎస్వో శ్రీ గంగ‌రాజు త‌‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.