SHOBHA YATRA HELD _ వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర

VONTIMITTA, 15 APRIL 2022: Shobha Yatra of Sri Sita Rama Utsavarulu was performed in connection with the celestial Kalyanotsavam.

 

In the evening Edurkolu event was held amidst chanting of Vedic hymnns with the traditional rituals of a Hindu wedding with Sri Rama and Sita Devi facing one another.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

 

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర

ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 15: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్ర‌వారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది.

ఎదుర్కోలు ఉత్సవం :

కల్యాణవేదిక వద్ద సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.