SHUTTLE AND BADMINTON HELD _ పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
Tirupati, 19 Feb. 22: The shuttle and badminton competitions were held for the employees and retired employees of TTD on Saturday.
These events were held in SV Arts College Sports Complex.
Retired employees competed on par with in service staff and exhibited their sportive spirit.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 19: టిటిడి ఉద్యోగుల క్రీడలు శనివారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోటాపోటీగా జరిగాయి.
– విశ్రాంత మహిళా ఉద్యోగుల బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి పుష్పకుమారి, శ్రీమతి నిర్మల కృష్ణన్ జట్టు విజయం సాధించగా, శ్రీమతి లలితమ్మ, శ్రీమతి సుమతి జట్టు రన్నరప్ గా నిలిచింది.
– విశ్రాంత పురుష ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీ చంద్రశేఖర్ రాజు జట్టు విజయం సాధించగా, శ్రీ దేవదాస్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి సరస్వతి విజయం సాధించగా, శ్రీమతి మహాలక్ష్మి రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల షటిల్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి సరస్వతి, శ్రీమతి చిన్నమునెమ్మ జట్టు విజయం సాధించగా, శ్రీమతి స్వప్న మంజరి, శ్రీమతి విజయలక్ష్మి జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి పద్మ విజయం సాధించగా, శ్రీమతి సుగుణమ్మ రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల షటిల్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి సుగుణమ్మ, శ్రీమతి పద్మ జట్టు విజయం సాధించగా, శ్రీమతి రమాదేవి, అనూరాధ జట్టు రన్నరప్ గా నిలిచింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.