ANKURARPANA HELD _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏకాంతంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 19 Feb. 22: Ankurarpana for annual Brahmotsavams in Srinivasa Mangapuram scheduled to commence from Sunday, was held in Ekantam on Saturday evening.

This fete was observed between 6pm and 8pm.

On Sunday, in the auspicious Meena Lagnam, Dhwajarohanam will take place marking the grand opening of annual fete.

Deputy EO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏకాంతంగా అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 19: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం 6 నుండి మృత్సంగ్ర‌హ‌ణంలో భాగంగా పుట్టమన్ను సేకరణ, శ్రీ విష్వక్సేనులవారికి సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఫిబ్ర‌వ‌రి 20న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు ఆదివారం ఉద‌యం 9 నుండి 9.20 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో శాస్త్రోక్తంగా ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టం జ‌రుగ‌నుంది. అంత‌కుముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.

 బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈఓ శ్రీ గురుమూర్తి, కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగల్రాయులు, ఎవిఎస్వో శ్రీ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.