SIDDHESWARA BRAHMOTSAVAMS _ జులై 10 నుండి 18వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 07 JULY 2022: The annual Brahmotsavam of Sri Siddheswara Swamy temple is scheduled from July 10-18 with Ankurarpanam on July 9.

The important days includes Dhwajarohanam on July 10, Nandi Vahanam on July 14, Pallaki Seva on July 16, Paruveta Utsavam on July 17, Trisula Snanam and Dhwajavarohanam on July 18.

Pushpayagam will be observed on July 19.

TTD is organising devotional cultural programmes with Hindu Dharma Prachara Parishad (HDPP) and Annamacharya Projects during these days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 10 నుండి 18వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 జులై 07: తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 9వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.

జులై 10న ఉదయం 6.58 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 11, 12, 13, 14 మ‌రియు 17వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా జులై 11న రాత్రి చంద్రప్రభ వాహనం, 12న‌ రాత్రి చిన్నశేష వాహనం, 13న రాత్రి సింహ వాహనం, 14న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

జులై 16న సాయంత్రం పల్లకీ సేవ, 17న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 18న ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

జులై 19వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.