SILK VASTRAMS OFFERED TO SRI RANGANATHA SWAMY BY TTD _ శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Tirumala, 8 December 2019 : In a traditional practice, TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal presented silk clothes to Sri Ranganadha Swamy at Srirangam in Tamil Nadu on Sunday. On the auspicious day of Kaisika Ekadasi every year, TTD offers pattu vastrams to the presiding deity in Srirangam.

The Trust Board Chief of TTD and EO along with Bokkasam Incharge Sri Gururaja were received by Srirangam temple Chairman Sri Venu Srinivasan on their arrival at the entrance of the temple.

From the past two decades TTD has been presenting the Vastrams to this famous temple located in Tamil Nadu on the auspicious occasion of Kaisika Ekadasi. To reciprocate the offerings made by TTD, the Sri Rangam Devasthanams offers silk vastrams to Srivari during auspicious day of Anivara Asthanam at Tirumala every year.

Meanwhile Kaisika Ekadasi is the Ekadasi that comes in the Shukla Paksha (waning fortnight) month of Karthika month.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

                                               
శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
 
తిరుమల, 08 డిసెంబ‌రు 2019 : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి ఆదివారం టిటిడి ధరకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి,  కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మన్, ఈవోకు శ్రీరంగం ఆలయ ఛైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మన్ కు, ఈవోకు అందజేశారు.
 
కైశిక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
 
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.