SIVA TANDAVAM STANDS SPECIAL _ క‌ల్ప‌వృక్ష వాహనసేవ‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా శివ‌తాండ‌వం

TIRUMALA, 30 SEPTEMBER 2022: Among the cultural troupes which performed unique arts in front of Kalpavriksha Vahanam, Siva Tandavam presented by Maruti Nasik Dole of East Godavari stood out.

 

Others included Oliyattam, Poojakunita, Mahelatamatam, Somanakunita, Legim Bhajan also allured the devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

క‌ల్ప‌వృక్ష వాహనసేవ‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా శివ‌తాండ‌వం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శుక్ర‌వారం ఉద‌యం శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 17 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చాయి.

ఈ సంద‌ర్భంగా తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల్లేప‌ల్లికి చెందిన మారుతి నాసిక్ డోల్ బృందం ఆధ్వ‌ర్యంలోని క‌ళాకారులు శివ‌తాండ‌వాన్ని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. అదేవిధంగా, పుదుచ్చేరి క‌ళాకారులు ఓళియాట్టం, క‌ర్ణాట‌క సంప్ర‌దాయ క‌ళారూపాలైన పూజ కుణిత‌, మ‌హేళ‌ట‌మ‌టం, సోమ‌న కుణిత‌, మ‌హారాష్ట్ర క‌ళాకారులు లెజిమ్‌ భ‌జ‌న్ భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

అదేవిధంగా, తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లు క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శించి కోలాటం, హ‌రేరామ భ‌జ‌న‌, భ‌ర‌త‌నాట్యం, చెక్క‌భ‌జ‌న అల‌రించాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.