SKVST PUSHPAYAGAM POSTERS RELEASED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Srinivasa Mangapuram, 13 March 2020: As the annual pushpayagam fete will be observed on March 20 in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, the posters for the same were released on Friday. 

The temple DyEO Sri Yellappa released the posters in the temple premises. 

The Ankurarpanam for the fete takes place on March 19.

All others temple staff members were also present during the event. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి, 2020 మార్చి 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన జ‌రుగ‌నున్న వార్షిక పుష్పయాగం గోడ‌ప‌త్రిక‌ల‌ను శుక్ర‌వారం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప ఆవిష్క‌రించారు.

ఈ ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుండి 22వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

మార్చి 19న గురువారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి 20న శుక్ర‌వారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

రూ.500/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 19న తిరుప్పావ‌డ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.