SNAPANAM HELD IN AYODHYA _ అయోధ్యలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
Tirumala, 19 January 2025: Snapana Tirumanjanam was held to the replica utsava deities of Swamy and Ammavarlu on the banks of river Sarayu on Sunday.
During the religious event the deities were rendered special Abhishekam with milk, curd, honey, turmeric, sandal paste reciting Pancha Suktams by Vedic scholars.
TTD Chairman Sri BR Naidu, Board member Sri Bhanuprakash Reddy and other officials, local devotees were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అయోధ్యలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
తిరుమల, 2025 జనవరి 19: అయోధ్యలో శ్రీ శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు దంపతులు హాజరయ్యారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని సరయూ నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్తరాది భక్తులు హాజరయాయ్యారు.
ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలైన శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తాలను అర్చకులు వల్లించారు.
అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.