TIRUMALA SO INSPECTS RING ROAD WORKS_ తిరుమలలో ప్రత్యేకాధికారి తనిఖీలు
Tirumala, 4 Aug. 19: TTD Tirumala Special Officer, Sri A V Dharma Reddy on Sunday inspected the ongoing engineering works at Tirumala.
As a part of the inspection he visited the parking areas at PAC 3, SPT, and later on, also inspected the 2nd and 3rd phase outer ring road works in scheduled time.
TTD In charge of Chief Engineer Sri Ramachandra Reddy, EE Sri Subramanyam, DE( Electrical), Smt Saraswati, and other officials participated in the inspection.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ప్రత్యేకాధికారి తనిఖీలు
తిరుమల, 2019 ఆగస్టు 04: టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదివారం పలు ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పనులపై తనిఖీలు చేపట్టారు. పిఏసి -3, సూరాపురం తోట విశ్రాంతి గదుల ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
అనంతరం ఔటర్ రింగ్ రోడ్ 2, 3 దశల పనులను దాదాపు 2 కి.మీ మేరకు ప్రత్యేకాధికారి తనిఖీ చేశారు. ఈ పనుల శైలిని మ్యాప్‌ల ద్వారా అధికారులు వివరించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ప్రత్యేకాధికారి ఆదేశించారు.
ప్రత్యేకాధికారి వెంట టిటిడి ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇ శ్రీ సుబ్రమణ్యం, డిఇ(ఎలక్ట్రికల్స్) శ్రీమతి సరస్వతి ఇతర అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.