SO REVIEWS MEETING ON PARAKAMANI ISSUES WITH BANKS_ ప‌ర‌కామ‌ణి విభాగంపై ప్ర‌త్యేకాధికారి స‌మీక్ష

Tirumala, 4 Aug. 19: TTD special Officer, Sri A V Dharma Reddy reviewed with the Bank officials on certain issues related to Parakamani.

The meeting was held at Annamaiah Bhavan in Tirumala on Sunday. Elucidating the bank officials on the functioning of Parakamani wing, the SO also put forth some long pending issues like the stagnation of Indian coins, Foreign Coin currencies, cut notes, soiled noted etc.offered by pilgrims in Srivari Hundi.

He said although the Federal and Andhra Banks have been doing the counting and transporting of coins on a day-to-day basis, still, there are accumulated stocks of coins and he sought the other banks also to involve in the process.

He also appealed to bank representatives to provide support in the task of handling the clearance of cut notes, foreign notes and coins, soiled notes, foreign cheques and current Indian coins and come out with a concrete solution after negotiating with their Bank Heads in a week’s time.

He exhorted the banks to extend support as a part of their Corporate Social Responsibility (CSR) agenda as the TTD was engaged in many social and welfare activities apart from its religious activities.

The SO also informed the Bank officials to enhance the remunerations of the out-sourced workers in the Laddu counters and also asked the bank officials to ensure that prompt staff attendance being maintained in the laddu counters.

The additional FACAO Sri Ravi Prasadudu, DyEo Parakamani Sri Venkataiah, DyEO Treasury Sri Devendra Babu participated in the meeting.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప‌ర‌కామ‌ణి విభాగంపై ప్ర‌త్యేకాధికారి స‌మీక్ష

తిరుమల, 2019 ఆగస్టు 04: టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదివారం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు. నాణేలు, క‌రెన్సీని ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి త‌ర‌లించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు బ్యాంకుల అధికారుల నుండి సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకాధికారి మాట్లాడుతూ భ‌క్తులు రోజువారీ హుండీలో స‌మ‌ర్పిస్తున్న నాణేలు, నిల్వ ఉన్న నాణేల‌ను ప్ర‌స్తుతం ఆంధ్రా బ్యాంకు, ఫెడ‌ర‌ల్ బ్యాంకు సేక‌రించి త‌ర‌లిస్తున్నాయ‌ని తెలిపారు. ఈ నాణేల‌ను పూర్తిగా సేక‌రించి త‌ర‌లించేందుకు మ‌రిన్ని బ్యాంకులు ముందుకు రావాల‌ని కోరారు. అదేవిధంగా, క‌ట్ నోట్లు, సాయిల్డ్ నోట్లు, విదేశీ నాణేలు, విదేశీ క‌రెన్సీ, విదేశీ బ్యాంకుల చెక్కులు, ప్ర‌స్తుతం చెలామ‌ణిలో లేని భార‌తీయ నాణేలను వాటి నిక‌ర విలువ ప్ర‌కారం సేక‌రించేందుకు బ్యాంకులు స‌హ‌కారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వస్తున్న భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతోపాటు టిటిడి అనేక ధార్మిక‌, సంక్షేమ‌, సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌ని, బ్యాంకులు త‌మ కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌గా స‌హ‌క‌రించాల‌ని కోరారు. కాగా, తిరుమ‌ల‌లోని ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి త‌గిన విధంగా వేత‌నాలు పెంచాల‌ని, స‌క్ర‌మంగా హాజ‌ర‌య్యేలా చూడాల‌ని ఆయా బ్యాంకుల అధికారుల‌ను కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఎఫ్ఏ, సిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, ఖ‌జానా విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.