SPECIAL OFFICER REVIEWS ON BRAHMOTSAVAM ARRANGEMENTS_ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేకాధికారి సమీక్ష
Tirumala, 5 Aug. 19: Tirumala Special Officer Sri AV Dharma Reddy held a preliminary review meeting on the ongoing arrangements with various departments for the ensuing annual brahmotsavams of Lord Venkateswara along with CVSO Sri Gopinath Jatti.
The detailed review meeting on Brahmotsavams was held in Annamaiah Bhavan on Monday evening which lasted for nearly three hours. After the meeting speaking to media persons the Special Officer said, the annual brahmotsavams of Srivaru at Tirumala are slated between September 30 to October 8. The important days includes Dhwajarohanam on September 30, Garuda Seva on October 4, Swarnaratham on October 5, Rathotsavam on October 7 and Chakrasnanam on October 8.
The SO also said that the trial run of Garuda Seva before the original fete will be performed on September 14. “The Engineering works will be completed by September 20 and the Koil Alwar Tirumanjanam will be performed on September 24. Other departments are also gearing up for the mega religious fete”, he added.
He said, the pilgrims who throng Tirumala temple during annual fete will be facilitated with hassle free darshan, vahana seva, laddu and annaprasadams while the security will be provided with the co-ordination between TTD Vigilance and Police and with the assistance of 3500 Srivari Sevakulu and 1000 Scouts.
Additional CVSO Sri Siva Kumar Reddy, In-charge CE Sri Ramachandra Reddy, Temple DyEO Sri Harindranath and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేకాధికారి సమీక్ష
తిరుమల, 2019 ఆగస్టు 05: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో విభాగాల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
సమావేశం అనంతరం ప్రత్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8 తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఇందులో ముఖ్యంగా సెప్టెంబరు 30న ధ్వజారోహణం, అక్టోబరు 4న గరుడసేవ, అక్టోబరు 5న స్వర్ణరథం, అక్టోబరు 7న రథోత్సవం, అక్టోబరు 8న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని, గరుడసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.. శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు బహూకరిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం జరుగుతాయన్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు సెప్టెంబరు 20 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రత్యేకాధికారి తెలిపారు. ఆయా విభాగాల అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పారు. సెప్టెంబరు 14న పౌర్ణమి సందర్భంగా ప్రయోగాత్మకంగా బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహిస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనం, వాహనసేవలు, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు. టిటిడి విజిలెన్సు, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుని భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. భక్తులకు సేవలందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటారని తెలిపారు. అన్ని విభాగాల వారు సమన్వయం చేసుకుని సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడు, ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారథి ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.