SOBHA YATRA OF LAKSHMI HARAM HELD_ వైభవంగా లక్ష్మీహారం ఊరేగింపు
Appalayagunta, 17 Jun. 19: The celestial procession of Lakshmi Kasula Haram was held at Appalagunta on Monday evening.
This precious jewel brought from Tiruchanoor will be adorned to Garuda Vahanam on the auspicious occasion of Sri Prasanna Venkateswara Swamy taking a ride on Garuda Seva.
The procession of jewel commenced at Hanuman temple in Appalayagunta.
Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopala Krishna Reddy, and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా లక్ష్మీహారం ఊరేగింపు
తిరుపతి, 2019 జూన్ 17: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి తీసుకొచ్చిన లక్ష్మీహారం ఊరేగింపు సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. అప్పలాయగుంట పురవీధుల గుండా ఊరేగింపుగా లక్ష్మీహారాన్ని ఆలయానికి తీసుకు వెళ్లి పూజలు నిర్వహించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయమానంగా ఊరేగింపు సాగింది.
ఇందులో భాగంగా సోమవారం రాత్రి గరుడ సేవలో ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడుడిని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీగోపాలకృష్ణా, కంకణభట్టార్ శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ నందీశ్వర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.