జూన్ 29న రాగి గోవిందమాలలు టెండర్ కమ్ వేలం
జూన్ 29న రాగి గోవిందమాలలు టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2019 జూన్ 17: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన రాగి లోహంతో చేసిన 1,000 కిలోల గోవిందమాలలను జూన్ 29వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు.
ఆసక్తి గలవారు జూన్ 29వ తేదీ సాయంత్రం 3.00 గంటలలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.5000/- డిడి తీసి సీల్డ్ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org, లేదా ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వెబ్‌సైట్ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను గానీ సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.