SPECIAL SAHASRA KALASABHISHEKAM ON JUNE 20 _ జూన్ 20న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala, 14 Jun. 21: The annual Special Sahasra Kalasabhishekam will be performed on June 20 commemorating the consecration of Bhoga Srinivasamurty.

About 14 centuries ago, Pallava Queen Samavai Perundevi has presented a foot tall Silver idol of Bhoga Srinivasamurty which is considered as the replica of the main deity of Venkateswara Swamy.

TTD has been observing this fete since 2006 celebrating the historical occasion. On June 20 Special Sahasra Kalasabhishekam will be observed in Ekantam in Vendi Vakili between 6am and 8:30am. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 20న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

తిరుమల, 2021 జూన్ 14: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.