SPORTS ENHANCE PHYSICAL AND MENTAL HEALTH-JEO _ ఉద్యోగుల ఆరోగ్యానికి క్రీడలు దోహదం : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 17 Feb. 20: Sports will help in enhancing the physical and mental stamina, thereby improving dynamism and efficiency of TTD employees to render services to Lord Venkateswara and his devotees with more enthusiasm, said TTD Joint Executive Officer, Sri P Basant Kumar.

Participating as chief Guest in the valedictory ceremony of the 15-day TTD employees annual sports meet-2020 at the Mahati auditorium in Tirupati on Monday evening, the JEO said that as per State government policy TTD had prioritised the sports for employees as a Health Wellness Program and was happy that employees had cut across ranks and ages and participated in the games in a right sportive spirit.

Earlier the JEO presented prizes to children of TTD employees who enthralled the audience with fancy dress competition.

He also presented the gift vouchers and citations to winners and runner-ups of the fortnight long competitions in various event .The cash purse were ₹2000 for winners and ₹1800 for runner-ups and ₹1500 for the third place.

In all 545 persons stood first, 536 came second and 93 were in third place. A record 1174 persons (702men and 456 women) including retired employees and their family members participated.

Welfare DyEO Smt Snehalata, PRO Dr.T.Ravi, EE Sri Mallikarjuna Prasad, DE Sri Chandrasekhar and other senior officers and employees participated. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఉద్యోగుల ఆరోగ్యానికి క్రీడలు దోహదం : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 17: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెఈవో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధంగానే టిటిడిలోనూ ఉద్యోగుల క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పెద్దసంఖ్యలో క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. మరింత మంది ముందుకు వచ్చి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు.

అంతకుముందు టిటిడి ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కాగా, వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జెఈవో చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విజేతలుగా నిలిచిన వారికి రూ.2 వేలు, రన్నర్లకు రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.1600/- గిఫ్ట్ ఓచర్లు అందజేశారు. 545 మంది ప్రథమ, 536 మంది ద్వితీయ, 93 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. మొత్తం వివిధ విభాగాల్లో 1,174 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 702 మంది పురుషులు, 456 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

అనంతరం టిటిడి వార్షిక క్రీడా పోటీల నివేదికను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, పిఆర్వో డా. టి.రవి, ట్రెజరీ డెప్యూటి ఈఓ శ్రీ దేవేంద్రబాబు, ఇఇ శ్రీ మల్లికార్జునప్రసాద్, డిఇ శ్రీ చంద్రశేఖర్ ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.