SPORTS HELD _ టిటిడి క్రీడా పోటీల్లో టెన్నికాయిట్ విజేతలు
Tirupati, 20 Feb. 22: The annual sports meet of TTD on Sunday witnessed Tennikoit for both in-service and retired employees.
Both men and women employees and retired employees participated enthusiastically and showcased their sportive skills.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి క్రీడా పోటీల్లో టెన్నికాయిట్ విజేతలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 20: టిటిడి ఉద్యోగులకు ఆదివారం టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
టిటిడి మహిళ ఉద్యోగులు..
– 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి లలిత విజయం సాధించగా, శ్రీమతి కళావతి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సులోచన, శ్రీమతి లలిత విజయం సాధించగా, శ్రీమతి కళావతి, శ్రీమతి నిర్మలారాణి రన్నర్‌గా నిలిచారు.
– టిటిడి విశ్రాంత మహిళా ఉద్యోగుల టెన్నకాయిట్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి భారతి, శ్రీమతి లలితమ్మ జట్టు విజేతగా నిలవగా, శ్రీమతి పుష్పకుమారి, శ్రీమతి ప్రభావతమ్మ రన్నరప్‌గా నిలిచింది.
విశ్రాంత పురుష ఉద్యోగులు..
– టిటిడి విశ్రాంత పురుష ఉద్యోగుల టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో శ్రీ పాండురంగారెడ్డి, శ్రీ సుధాకర్ జట్టు విజయం సాధించగా, శ్రీసుధాకర్ రెడ్డి, శ్రీసుబ్రమణ్యం జట్టు రన్నర్‌గా నిలిచారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.