ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
ఫిబ్రవరి 03, తిరుపతి, 2019: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
– 41 నుంచి 50 ఏళ్లలోపు పురుషుల స్వీమింగ్ పోటీల్లో శ్రీ యర్రంరెడ్డి మొదటి స్థానం, శ్రీ రెడప్ప 2వ స్థానం, శ్రీ గోవిందు 3వ స్థానంలో నిలిచారు.
– 40 ఏళ్లలోపు పురుషుల స్వీమింగ్ పోటీల్లో పోటీల్లో శ్రీ మల్లికార్జున మొదటి స్థానం, శ్రీ చక్రవర్తి 2వ స్థానం, శ్రీ వెంకటరమణ 3వ స్థానంలో నిలిచారు.
– టిటిడి విశ్రాంత ఉద్యోగుల పురుషుల బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో కె.రామమూర్తిరెడ్డి జట్టు విజేతగా నిలవగా, శ్రీ భాస్కర్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– బధిర పురుషుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో శ్రీ శ్రీకాంత్ విజయం సాధించగా, శ్రీ మధుసూదన శర్మ రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ సునీల్‌కుమార్, శ్రీ మధుసూదనశర్మ జట్టు విజయం సాధించగా, శ్రీ ఐ.సాయప్రసాద్, శ్రీ మల్లిఖార్జున జట్టు రన్నర్స్‌గా నిలిచారు.
– బధిర మహిళల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి సంపూర్ణ సాధించగా, శ్రీమతి కుమారి రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి కుమారి, శ్రీమతి ప్రసున్న జట్టు విజయం సాధించగా,శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి సంపూర్ణమ్మ జట్టు రన్నర్స్‌గా నిలిచారు.
– ప్రత్యేక ప్రతిభవంతుల పురుషుల చెస్ పోటీల్లో శ్రీ రవికుమార్ విజేతగా నిలవగా, శ్రీ సత్యం రన్నరప్‌గా నిలిచారు.
——————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.