CHANTING BHAGAVATNAMA IS ULTIMATE WAY TO SALVATION-SEER_ భగవన్నామస్మరణతో కష్టాలు దూరం: శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ

Tirumala, 3 February 2019: The pontiff of Sri Thambihalli Mutt of Kolar district in Karnataka, HH Sri Vidhya Sindhu Madhava theerta swami said the easy way for salvation in Kaliyuga is through chanting divine names of Lord.

The Purandhara Dasa Aradhana mahotsavam commenced on a religious note in Asthana Mandapam at Tirumala on Sunday. The seer who took part in this fete, during his spiritual address said that as a small spic of fire will burn to ashes a huge heap of cotton, in a similar manner, the chanting of divine names will we throw away our difficulties”, he added.

Dasa Sahitya Project Special Officer Sri P Anandateerthacharyulu, over 3000 dasa bhaktas hailing from AP, TS, TN, Karnataka and Maharashtra were also present.

Meanwhile there will be Inka Seva of deities in Narayanagiri Gardens on Monday evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

భగవన్నామస్మరణతో కష్టాలు దూరం: శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ

తిరుమలలో శ్రీపురందరదాసుల అరాధన మహోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2019 ఫిబ్రవరి 03: పెద్ద దూదికొండనైనా చిన్న అగ్నికణం దహించేస్తుంది అన్నట్టు ఎంతటి కష్టాన్నైనా భగవన్నామస్మరణ దూరం చేస్తుందని కోలార్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలోని ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కోలార్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాసింధుమాధవ తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. కలియుగంలో భగవంతుని నామసంకీర్తనమే ముక్తికి మార్గమని పేర్కొన్నారు. పురందరదాసుల వారు తన జీవితాన్ని దాస కీర్తనల రచనకే అంకితం చేశారని చెప్పారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్తాన్ని, శరణాగతి విధానాన్ని, నరుడు-నారాయణడు మధ్యగల సంబంధాన్ని తెలియజేశారని అన్నారు. మనకు మానవజన్మ ఇచ్చి భగవంతుడు ఉపకారం చేశాడని, ధర్మాచరణ ద్వారా ఆయనకు మనం ప్రత్యుపకారం చేయాలని సూచించారు.

అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ”గురుపురందర దాసరే…., వండిదే పురందరదాసర….” తదితర సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 4న నారాయణగిరి ఉద్యానవనంలో సంకీర్తనాలాపన :

ఫిబ్రవరి 4వ తేదీన సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న తిరుమలలోని ఆస్థానమండపంలో భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనం, హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమాలు చేపడతారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.