SPOT ADMISSIONS FOR ADMISSION IN TTD DEGREE COLLEGES _ టీటీడీ డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

Tirupati, 06 October 2024: Spot admissions will be conducted in TTD-run Sri Padmavathi Women’s Degree and PG College (Autonomous), Sri Govindarajaswamy Arts College (Autonomous), Sri Venkateswara Arts College (Autonomous), SV Prachya (Oriental) Kalashala, SV Sangeet Nritya Kalashala for the academic year 2024-25 the respective colleges.
 
For this, the students are requested to contact the principals of the respective colleges with the original certificates from October 7 to 9.
 
Those who got spot admissions will not get hostel accommodation, fee reimbursement and scholarships.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుపతి, 2024 అక్టోబ‌రు 06: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి మహిళా డిగ్రీ మరియు పీజీ క‌ళాశాల‌(అటానమస్), శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ (అటానమస్), శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాల(అటానమస్), ఎస్వీ ప్రాచ్య(ఓరియంటల్) క‌ళాశాల‌, ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు అక్టోబ‌రు 7 నుండి 9వ తేదీ వ‌ర‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.

స్పాట్ అడ్మిష‌న్లు పొందిన వారికి హాస్ట‌ల్ వ‌స‌తి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాల‌ర్‌షిప్‌లు ఉండవని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.