SRI BHRIGU MAHARSHI AND SRI SRINIVASA MAKHI TIRUNAKSHATRAMS _ ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు
TIRUMALA, 30 APRIL 2025: The Tirunakshatram of the revered Vaikhanasa Acharyas, Sri Bhrigu Maharshi and Sri Srinivasa Makhi, was celebrated with grandeur on Wednesday evening in Tirumala.
The event took place at the Asthana Mandapam under the aegis of the TTD’s Alwar Divya Prabandha Project and the Vaikhanasa Divya Siddhanta Vardhini Sabha.
Eminent Vaikhanasa Agama scholars including Sri Prabhakaracharyulu, President of the Vaikhanasa Divya Siddhanta Vardhini Sabha Sri Raghava Deekshitulu, and Secretary Sri Srinivasa Deekshitulu participated and recalled the divine contributions made by these two great saints.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు
తిరుమల, 2025 ఏప్రిల్ 30: వైఖానస అచార్యులు శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు బుధవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగాయి.
తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధినీ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైఖానస ఆగమ పండితులు శ్రీ ప్రభాకరాచార్యులు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధనీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు, కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు పాల్గొని ఆ ఇద్దరు మహానుభావులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.