SRI GT PARUVETA UTSAVAM OBSERVED_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati, 17 Jan. 19: The Mock Hunt Festival ”Paruveta Utsavam” of Sri Govinda Raja Swamy temple was observed with religious fervour in Tirupati on Thursday.

The processional of Sri Govindaraja Swamy was brought to Paruveta Mandapam located in Renigunta and a pleasure hunt was performed.

The religious staffs on behalf of Lord enacted mock hunt throwing weapons on wild beasts. Devotees converged in large numbers to witness this fun filled festival.

Temple DyEO Smt Varalakshmi, AEO Sri Udaya bhaskar Reddy, Temple Inspector Sri Prasanth, Temple Archakas and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2019 జనవరి 17: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.00 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ ఉద‌య్ భాస్క‌ర్ రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రశాంత్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.