SRI KALYANA VENKATESWQARA SWAMY ON THE TEPPA _ తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి క‌టాక్షం

Tirupati, 19 February 2024: As part of Sri Govindaraja Swamy annual Theppotsavams, in the guise of Sri Kalyana Venkateswara Swamy blessed the devotees on the third day on Monday between  6.30 pm to 8 pm.

Sri Sri Sri Pedda Jeeyar Swami, Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Mohan Rao, Temple Inspector Sri Dhananjaya, other officials and a large number of devotees participated in the Teppotsavam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి క‌టాక్షం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 19: శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమ‌వారం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు

తెప్పోత్స‌వాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహ‌న్‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌య‌, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.