SRI RAMA RIDES HANUMA _ హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

VONTIMITTA, 13 APRIL 2022: On the fourth day evening of the ongoing annual Sri Ramanavami Brahmotsavam in Vontimitta Kodanda Ramalayam at YSR Kadapa district, Sri Rama took a celestial ride on His favour Hanuman carrier on Wednesday.

Known for His Sharanagata Bhakti, Hanuman is always revered for commitment, dedication and total surrender towards His master.

Temple DyEO Sri Ramana Prasad and other office staffs were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి, 2022 ఏప్రిల్ 13: ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగ‌వ‌ రోజు బుధ‌వారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. క‌ళాబృందాల కోలాటాలు ఆక‌ట్టుకున్నాయి.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.

వాహ‌న‌సేవ‌లో ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.