SRI SRINIVASA DIVYANUGRAHA VISESHA HOMAM IS A BOON FOR DEVOTEES-PILGRIM CALLER _అలిపిరి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ సంతోషకరం
POSSIBILITY OF ALAYAPRADAKSHINAM INSTEAD OF GIRIPRADAKSHNIAM FOR TIRUMALA-TTD EO
TIRUMALA, 01 DECEMBER 2023: Pouring in laurels on Sri Srinivasa Divyanugraha Visesha Homam commenced by TTD at Alipiri Gomandiram on November 23, a pilgrim caller Sri Eswar from Tirupati described it as a boon for devotees who wish to perform the sacred pyre on their special days and thanked TTD Chairman and the EO for introducing the unique Homam for the sake of devotees.
The monthly Dial your EO programme was held at Annamaiah Bhavan in Tirumala on Friday wherein the TTD EO Sri AV Dharma Reddy attended to the calls of 24 pilgrims. The caller from Tirupati also sought EO to introduce a Twitter account for TTD to resolve the issues of pilgrims as the Dial you EO programme lasts only for an hour. Replying to the caller, the EO said, already TTD has a call centre, a Whatsapp number for the redressal of devotees’ complaints. However, he said, he will look into the possibility of opening a Twitter account for TTD.
Another caller, Sri Sudhakar Rao from Cheepurupalli suggested EO to check the possibility of Giripradakshinam for Tirumala also akin to Tiruvannamalai to which the EO responded, it is indeed a great suggestion. But due to its geographical composition, Giripradakshina is not possible in Tirumala, instead, the possibility of Maha Pradakshinam shall be checked for devotees taking a walk around the temple in the Outer Ring Road, he opinioned.
A pilgrim caller Sri Appanna from Vizag sought EO to provide Akshata(holy rice) along with prasadam to devotees to which the EO answered it is not possible as the Akshata is provided only to Kalyanotsavam devotees. And to his another feedback he said, TTD has already prepared a chart to perform arjita sevas in Sri Godadevi sameta Sri Venkateswara Swamy temple at Visakhapatnam which will be commenced soon.
The EO said stringent action will be taken against the staff in the luggage counter on which the pilgrim caller Sri Kumar from Rajamundry complained. Another caller Sri Ravi from Kavali suggested EO to commence an Eye Bank on the lines of Blood Bank to which he replied they will look into the possibility of establishing one at SVIMS superspecialty hospital.
Another caller Smt Vijaya Lakshmi sought the EO to facelift Sri Ranganatha Swamy temple in Warangal to which the EO said the team from TTD will inspect and see the possibility of developing the temple with SRIVANI funds.
When a Chennai-based devotee Sri Dhananjay sought EO to appoint an officer for the Alwar Divyaprabandha Project to which the EO reacted already an officer is there to take care of the programmes related to that Project.
Similarly, callers Sri Srinivas, Sri Shankar Goud from Hyderabad sought the EO to improve the quality of laddu prasadam and reduce the usage of sugar candy in it to which the EO said, laddus are being prepared by Potu workers as per the Dittam. However, he said once again they are instructed to maintain the quality, he added.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అలిపిరి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ సంతోషకరం
– డయల్ యువర్ ఈవోలో హర్షం వ్యక్తం చేసిన భక్తుడు
– తిరుమలలో గిరి ప్రదక్షిణ వీలుకాదు : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 డిసెంబరు 01: అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం చక్కగా నిర్వహిస్తున్నారని, తాము కూడా ఇందులో పాల్గొన్నామని తిరుపతికి చెందిన ఈశ్వర్ అనే భక్తుడు సంతోషం వ్యక్తం చేశారు. తిరువణ్ణామలై, మథురలో ఒక కొండ మాత్రమే ఉందని, తిరుమలలో సప్తగిరులు ఉన్నాయి కావున ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.
1. శ్రీధర్ – మంచిర్యాల, శ్రీనివాస్ – ప్రొద్దుటూరు
ప్రశ్న: వైకుంఠ ఏకాదశికి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకలేదు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఎప్పటినుండి ఇస్తారు.
ఈవో : డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 4.25 లక్షల టికెట్లు జారీచేస్తాం. దీని విధివిధానాలపై చర్చిస్తున్నాం.
2. కిరణ్ కుమార్ – తిరుపతి
ప్రశ్న: అఫ్‌లైన్‌లో లక్కీ డిప్ సేవా టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ రావడం లేదు. సేవా టికెట్లు పొందిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచండి. ప్రతి రోజు ఖచ్చితమైన సంఖ్యలో లక్కీడిప్ సేవా టికెట్లు విడుదల చేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈవో : అఫ్‌లైన్‌లో లక్కీ డిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తాం. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో సేవా టికెట్లు విడుదల చేయడం వీలుకాదు.
3. అప్పన్న – వైజాగ్
ప్రశ్న: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదంతోపాటు అక్షింతలు కూడా ఇవ్వండి. విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పాల్గొనే అవకాశం కల్పించండి. అన్నప్రసాదాలు అందించండి.
ఈవో: తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అక్షింతలు అందిస్తున్నాం. దర్శనానంతరం భక్తులకు అక్షింతలు అందించే విషయమై ఆగమ సలహామండలితో చర్చిస్తాం. విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం త్వరలో కల్పిస్తాం.
4. విజయలక్ష్మి – హైదరాబాద్
ప్రశ్న: వరంగల్‌లోని పురాతన శ్రీ రంగనాథ స్వామి ఆలయం జీర్ణోద్ధరణకు సహకారం అందించండి.
ఈవో: శ్రీవాణి ట్రస్ట్ నుండి సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటాం.
5. శంకర్ గౌడ్ – హైదరాబాద్
ప్రశ్న: వైకుంఠ ఏకాదశికి తిరుమల, తిరుపతిలలో ఆన్‌లైన్‌లో గదులు విడుదల చేయలేదు. లక్కీడిప్ టికెట్లు ఆన్‌లైన్లో విడుదల చేయండి. వృద్ధులు, వికలాంగులతోపాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనుమతించండి. లడ్డూలో కలకండ ఎక్కువగా ఉంది.
ఈవో: డిసెంబరు 23, 24వ తేదీల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ లేదు. తిరుమలలో వసతి కొరకు సిఆర్‌వో వద్ద పేర్లు రిజిస్టర్ చేసుకుని పొందవచ్చు. తిరుపతిలో ప్రైవేట్ వసతి చాలా ఉంది. ఆన్‌లైన్‌లో లక్కీడిప్ సేవా టికెట్లు ఇవ్వడం వీలుకాదు. లక్కీడిప్ ద్వారా మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. పోటు కార్మికులతో చర్చించి లడ్డు నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
6. ధనుంజయ్ – చెన్నై
ప్రశ్న: 25 ఏళ్ల ముందే దూరదృష్టితో ఆలయ నాలగు మాడ వీధులను విస్తరించి అద్భుతంగా రూపొందించారు. ధన్యవాదాలు. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారిని నియమించండి. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను చేపట్టండి.
ఈవో : 2004 -06 మధ్య కాలంలో తిరుమలలోని నాలుగు మడ వీధుల్లో ఉన్న దాదాపు 600 ప్రైవేట్ ఆస్తులను తీసుకొని నాలుగు మాడ వీధులను విస్తరించి, గ్యాలరీలను ఏర్పాటు చేశాం. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పద్ధతిలో అధికారి ఉన్నారు. ధనుర్మాసంలో 30 రోజులు పాటు 30 పాశురాలను అర్థతాత్పర్యాలతో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ మఠం నుండి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
7. సాయి శరత్ – మదనపల్లి, శ్రీనివాసులు రెడ్డి – గుంటూరు
ప్రశ్న: శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లలో తోపులాట ఎక్కువగా ఉంది. వృద్ధులు, దివ్యాంగుల షెడ్‌లో కుర్చీలు సరిగా మా నాన్నగారి కాలికి గాయమైంది.
ఈవో : భక్తుల రద్దీ అధికంగా ఉండడం వలన స్వల్ప తోపులాట జరుగుతూ ఉంటుంది. క్యూలైన్లను నిరంతరాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటాం. వృద్ధులు, దివ్యాంగుల షెడ్‌లో కుర్చీలను మారుస్తాం.
8.కుమార్ – రాజమండ్రి
ప్రశ్న: తిరుమలలో లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వలేదని బ్యాగ్‌లు విసిరేస్తున్నారు. నా బ్యాగులోని కొన్ని దుస్తులు కనిపించలేదు.
ఈవో: ఇలాంటి సంఘటనలపై భక్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మా అధికారులు మీతో మాట్లాడి వివరాలు తీసుకుని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
9. రవి – కావలి
ప్రశ్న: విద్య, వైద్య రంగాలలో టీటీడీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. టీటీడీ ఆధ్వర్యంలో ఐ బ్యాంక్ స్థాపించి లక్షలాది మంది అంధులకు నేత్రదానం చేయండి.
ఈవో: తిరుపతిలోని అరవింద్ ఐ హాస్పిటల్‌లో ఐ బ్యాంక్ ఉంది. స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.
10. శ్రీనివాస్ – హైదరాబాద్
ప్రశ్న : శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద కాళ్లు శుభ్రం చేసుకునేందుకు కొన్నిసార్లు నీళ్లు రావడం లేదు. కల్యాణకట్టలో ఆపరిశుభ్రంగా, దర్గంధభరితంగా ఉంటుంది. లడ్డూలో కలకండ ఎక్కువగా వస్తోంది.
ఈవో: మహద్వారం వద్ద నిరంతరాయంగా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. కల్యాణకట్టలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. లడ్డు నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంటాం.
11. వెంకటరెడ్డి – తణుకు
ప్రశ్న: వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆన్‌లైన్‌లో టికెట్లు కేటాయించడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో నేరుగా ఇవ్వండి.
ఈవో: ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని అధిక సంఖ్యలో భక్తులు కోరారు. తద్వారా వారికి నిర్దేశించిన తేదీ, సమయానికి దర్శనానికి వస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం వీలుకాదు.
12. విశ్వనాధ్ – బెంగళూరు
ప్రశ్న: తిరుమల నాదనీరాజనం వేదికపై సంకీర్తనలు పాడేందుకు అవకాశం కల్పించిన విధంగానే, శ్రీవారి గర్భగుడిలో గాయకులకు పాడే అవకాశం కల్పించండి.
ఈవో: శ్రీవారి ఆలయంలో వేద పారాయణం మాత్రమే ఉంటుంది. ఏకాంత సేవలో మాత్రమే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం జరుగుతుంది.
13. ఈశ్వర్ – తిరుపతి
ప్రశ్న : అలిపిరి వద్ద శ్రీనివాస హోమం చక్కగా నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు. ట్విట్టర్ ద్వారా కూడా భక్తుల సమస్యలకు సమాధానాలు ఇవ్వండి.
ఈవో : టీటీడీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కూడా టీటీడీ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. ట్విట్టర్ ద్వారా కూడా సమాచారం అందించే విషయాన్ని పరిశీలిస్తాం.
14. నాగేశ్వరరావు – తిరుపతి
ప్రశ్న: తిరుపతిలో యోగాధ్యయన కేంద్రం ఏర్పాటు చేయండి.
ఈవో : మీతో సమావేశమై యోగాధ్యాన కేంద్రం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం.
15. హైదరాబాద్ – జగదీష్
ప్రశ్న: లడ్డూ కాంప్లెక్స్ లో వడ ప్రసాదం కోసం లైన్లో ఉండగా, టీటీడీ సిబ్బంది మధ్యలో వచ్చి ఎక్కువ మొత్తంలో వడలు తీసుకెళుతున్నారు. శ్రీవారి దర్శనానికి కొందరు మహిళలు జీన్స్ ప్యాంట్ తో వస్తున్నారు. వస్త్రధారణ సరిగా ఉండేలా చూడండి. శ్రీవారి సేవకులతో టీటీడీ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారు.
ఈవో : వడ ప్రసాదం పరిమితంగా తయారు చేయడం జరుగుతుంది. వడలు భక్తులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటాం. భక్తులందరూ సంప్రదాయ వస్త్రధారణ పాటించేలా సూచనలు ఇస్తాం. శ్రీవారి సేవకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే అక్కడున్న అధికారులకు ఫిర్యాదు చేయండి. తగిన చర్యలు తీసుకుంటాం.
16. ప్రభాకర్ రెడ్డి – తాడిపత్రి
ప్రశ్న : నడక మార్గం మధ్యలో దర్శనటోకెన్లు తిరిగి కేటాయించండి.
ఈవో : దర్శన టికెట్ల కోసమే ఎక్కువ మంది భక్తులు నడక మార్గంలో నడిచి వస్తున్నారు. ఇటీవల క్రూరమృగాల దాడులు జరగడంతో తప్పనిసరిగా నడిచిరావాలనే నిబంధన తొలగించి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు కేటాయిస్తున్నాం.
17. గురుబ్రహ్మం – హైదరాబాద్
ప్రశ్న : నాదనీరాజనంపై ప్రవచనకారులు కింద కూర్చొని ప్రవచనాలు చెబుతున్నారు. వీరికి సౌకర్యంగా ఉండేలా ఉచిత ఆసనం కల్పించండి.
ఈవో : ప్రవచనకారులు ప్రతిరోజు యోగా చేస్తారు. వారి కోరిక మేరకే కింద కూర్చొని ప్రవచనాలు చెబుతున్నారు.
18. రాజు – హిందూపురం
ప్రశ్న : శ్రీవారి దర్శనానికి ఏటీసీ సర్కిల్ నుంచి ప్రవేశించాము. ఒకటిన్నర కిలోమీటరు దూరం నడిపించి తిరిగి అదే సర్కిల్ కు తీసుకొచ్చారు. దీనివల్ల పిల్లలు, వృద్దులు చాలా ఇబ్బందిపడ్డారు.
ఈవో : అలా జరిగే అవకాశం లేదు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
19. సుధాకర్ రావు – చీపురుపల్లి
ప్రశ్న : తిరుమల కొండల చుట్టూ గిరిప్రదక్షిణ చేసే అవకాశం కల్పించండి.
ఈవో : తిరుమలలో ఒకే కొండ విడిగా లేదు. కావున గిరిప్రదక్షిణ చేసే అవకాశం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో ఆలయ ప్రదక్షిణ చేయవచ్చు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.