SRI SRINIVASA SHANTYUTSAVA SAHITA DHANWANTARI MAHA YAGAM COMMENCES AT DHARMAGIRI _ తిరుమలలో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభం

Tirumala, 26 Mar. 20: In order beget the blessings of Sri Venkateswara Swamy towards welfare of humanity freeing it from the clutches of Covid 19 Corona Virus, TTD is organising a three day Sri Srinivasa Shantyutsava Sahita Dhanwantari Maha yagam at the Dharmagiri Veda Vijnan peerham in Tirumala which commenced on Thursday.

Speaking about the importance of the Yagnam, Sri Mohanarangacharyulu, Vaikhanasa Agama Advisor said, Vaikhanasa Agama Shastra indicates three types of utsavams are conducted to Lord including Nityotsavams, Shraddhotsavams and Shantyotsavams that are conducted.

To invoke the blessings of Lord at times of pandemics, natural calamities acts of violence and global scare, Shantyotsavams are being conducted. “We have commenced the Yagam with Akalmasha Puja after Sankalpam. As a part of thus the blessings of Sri Dhanwantari, the God of medicine is invoked. 

Maha Purnahuti is performed on March 28 after conclusion of Vishesha homas.

The Kumbum which is worshipped all the three days will be there after immersed in reservoirs and dams of Tirumala and it is believed that the divine waters will mix with environment through air and eliminate the unhealthy viruses and elements.

Meanwhile Seven sacred Homa pyres are set up (five for Srinivasa murthy, one for Sri Dhanwantari and one for Prayaschitta homa and in all 11 Rutwiks are performing the Yagam. During the Yagam the Rutwiks will recite Parayanams of the Veda mantras from Chaturvedas appeasing Lord Surya and Asta Dikpalakas.

TTD Addnl. EO Sri AV Dharma Reddy, temple OSD Sri P Seshadri participated.  

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభం
 
తిరుమల, 2020 మార్చి 26: తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో గురువారం శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభమైంది.  విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తారు.
 
ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆవాహన చేసి హోమాలు నిర్వహిస్తారని తెలిపారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, శ్రద్ధోత్సవాలు, శాంతి ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు. భయంగానీ, ఉపద్రవాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, మహావ్యాధులు గానీ ప్రబలినప్పుడు శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారని వివరించారు.
 
గురువారం ఉదయం అకల్మష హోమంతో యాగం ప్రారంభమైంది. రాత్రి శ్రీ శ్రీనివాసమూర్తిని, శ్రీ ధన్వంతరిమూర్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. మార్చి 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు. మార్చి 28న విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుంభ జలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది.
 
ఈ యాగం కోసం శ్రీనివాసమూర్తికి 5, శ్రీ ధన్వంతరిమూర్తికి 1, ప్రాయశ్చిత్త హోమానికి 1 కలిపి మొత్తం 7 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. 11 మంది రుత్వికులు పాల్గొన్నారు. ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.