SRI TIRUMALA NAMBI 1049thAVATRARA MAHOTSAVAM HELD _ భగవంతుడి సేవే ప‌ర‌మావ‌ధిగా శ్రీ తిరుమ‌ల‌నంబి కైంక‌ర్యం : శ్రీ‌శ్రీ‌శ్రీ వ‌రాహమ‌హాదేశిక‌న్ జీయ‌ర్ స్వామి

Tirumala, 03 September 2022:  TTD has observed the 1049th Avatara Mahotsavam of prominent Sri Vaishnava Acharya Sri Tirumala Nambi at his temple located in the South Mada street at Tirumala on Saturday.

 

As part of festivities, a discourse by 16 eminent Vedic Pundits was held in the morning on the life and achievements of Sri Tirumala Nambi. 

 

Legends says that he was the maternal uncle of Sri Ramanujacharya and pioneered Thirtha Kainkaryams at Sri Venkateswara temple. Tirumala Nambi used to bring holy waters from Papavinasam steam, which is located 8kms away, for Srivari abhisekam every day. To lessen the burden of His ardent devotee in his riped age, the Lord Himself in the guise of a boy created Akasa Ganga stream and blessed Tirumala Nambi.

 

HH Sri Srirangam Srimadandavan Varaha Mahadesikan Swamy of Andavan Ashramam rendered Anugraha Bhashanam on the occasion.

 

The successors of Tirumala Nambi including Sri TK Krishnaswamy Tatacharya, Sri Chakravarthi Ranganathan, Alwar Divya Prabandha Project Officer Sri Purushottam have also participated in this fete.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భగవంతుడి సేవే ప‌ర‌మావ‌ధిగా శ్రీ తిరుమ‌ల‌నంబి కైంక‌ర్యం : శ్రీ‌శ్రీ‌శ్రీ వ‌రాహమ‌హాదేశిక‌న్ జీయ‌ర్ స్వామి

వేడుక‌గా శ్రీ తిరుమలనంబి 1049వ అవతార మహోత్సవాలు

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 03: భగవంతుడి సేవే ప‌ర‌మావ‌ధిగా భావించి శ్రీ తిరుమ‌ల‌నంబి జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంక‌ర్యానికి అంకితం చేశార‌ని త‌మిళ‌నాడులోని శ్రీ‌రంగానికి చెందిన శ్రీ‌మ‌ద్ ఆండ‌వ‌న్ ఆశ్ర‌మానికి చెందిన‌ శ్రీ‌శ్రీ‌శ్రీ వ‌రాహ‌మ‌హాదేశిక‌న్ జీయ‌ర్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1049వ అవతార మహోత్సవం శ‌నివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన శ్రీ‌శ్రీ‌శ్రీ వ‌రాహమ‌హాదేశిక‌న్ జీయ‌ర్ స్వామి అనుగ్ర‌హ‌భాష‌ణం చేస్తూ శ్రీ తిరుమ‌ల‌నంబి తన తాతగారు అయిన శ్రీ యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువ‌చ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తున‌ప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.
సాక్షాత్తు భ‌గ‌వంతుడు ఉప‌దేశించిన భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను సంగ్ర‌హించి శ్రీ య‌మునాచార్యులు 32 శ్లోకాల‌తో గీతార్థ సంగ్ర‌హం పేరుతో గ్రంథం ర‌చించార‌ని చెప్పారు. ఈ శ్లోకాలు బ్ర‌హ్మ‌విద్య‌తో స‌మాన‌మైన‌వ‌ని కొనియాడారు.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ కీలకోపన్యాసం చేస్తూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. స్వామివారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేద‌పారాయ‌ణ కైంక‌ర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ శ్రీ తిరుమలనంబి అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్‌ రామానుజులవారికి మేనమామ అన్నారు. శ్రీమద్‌ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు.

అనంతరం గీతార్థ సంగ్ర‌హం గ్రంథంపై 16 మంది పండితులు కూలంక‌షంగా ఉప‌న్య‌సించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమలనంబి వంశీకులు శ్రీ కృష్ణమూర్తి తాతాచార్యులు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.