FOCUS ON CHILDREN’S SUPER SPECIALITY HOSPITAL- SPECIAL CS DR K JAWAHAR REDDY _ చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి-టిటిడి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

* LAUDS TTD FOR E-MBOOK IMPLEMENTATION

Tirupati, 03 September 2022: Former TTD EO and Special CS in CMO Dr KS Jawahar Reddy on Saturday advised TTD officials to focus on the construction works of Sri Padmavati Children’s Super Specialty Hospital and also appreciated TTD for complete implementation of e-m book app.

Virtually addressing a review meeting from his Tadepalli office with TTD EO Sri AV Dharma Reddy and other senior officials, Dr Jawahar Reddy exhorted officials to take up hospital construction works, including fund raising and project progress etc. on war footing

Among others he lauded the 615 heart surgeries at Children’s Hospital, Cleft lip and Palate surgeries for children at BIRRD hospital, developing artificial limbs production at BIRRD, Improving medical services in SVIMS, beautification of Anjaneya birthplace locations at Akashaganga and completion of Museum in Tirumala within 18 months etc.

He also reviewed on precautionary steps to avert landslides on Ghat roads during heavy rains, complete the Srivari temple at Jammu and Sri Padmavati temple at Chennai ahead of schedule, health cards with perfect health profiles of all TTD employees and EHS fund for safeguarding employees’ health.

Dr Reddy lauded heart-swelling program of “Adivo… Alladiv” on SVBC and suggested to come out with more such programs. He expressed immense satisfaction over the growing demand for agarbattis and Panchagavya products and need to set up second unit for manufacturing.

TTD EO Sri AV Dharma Reddy explained steps being taken for promoting energy meters in rest houses, feed mixing plant in Goshalas, promoting nodal goshalas in state, fertility campaign for desi breeds, electric buses and steps taken for begetting NAC recognition for TTD educational institutions.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FA& CAO Sri Balaji, CE Sri Nageswara Rao and other HODs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి

– టిటిడిలో ఇ-ఎంబుక్ అమ‌లుపై అభినంద‌న‌

– టిటిడి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2022 సెప్టెంబ‌రు 03: శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. టిటిడిలో ఇ-ఎంబుక్ పూర్తిస్థాయిలో అమ‌లవుతోంద‌ని అభినందించారు. తాడేప‌ల్లిలోని త‌న కార్యాల‌యం నుంచి శ‌నివారం సాయంత్రం ఆయ‌న టిటిడి ఈవో, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న‌పిల్లల ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణానికి నిధుల స‌మీక‌ర‌ణ‌, నిర్మాణ‌ప‌నులు వెంట‌నే ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యంలో ఇప్ప‌టిదాకా 615 శ‌స్త్రచికిత్స‌లు ఉచితంగా చేయ‌డం అభినందనీయ‌మ‌న్నారు. బ‌ర్డ్ ఆసుప‌త్రిలో స్మైల్ ట్రైన్ సంస్థ ద్వారా ఈ నెల‌లోనే గ్ర‌హ‌ణ‌మొర్రి ఆప‌రేష‌న్లు ప్రారంభించాల‌ని చెప్పారు. బ‌ర్డ్‌లో కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రాన్నిఅభివృద్ధిప‌ర‌చ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌ద్వారా దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది ఈ సేవ‌లు ఉప‌యోగించుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు. స్విమ్స్‌లో రోగుల‌కు మ‌రింత మెరుగైన వైద్య‌సేవ‌లు అందేలా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవోను కోరారు. తిరుమ‌ల ఆకాశ‌గంగ స‌మీపంలోని హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌ల‌మైన అంజ‌నాద్రి సుంద‌రీక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. తిరుమ‌ల మ్యూజియం అభివృద్ధి ప‌నుల‌ను ఏడాదిన్న‌ర లోగా పూర్తి చేయాల‌న్నారు.

భారీ వ‌ర్షాలు కురిసినా ఘాట్ రోడ్ల‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జ‌మ్మూలోని శ్రీ‌వారి ఆల‌యం, చెన్నైలోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య నిర్మాణాలను నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యసంర‌క్ష‌ణ ప‌థ‌కం(ఇహెచ్ఎస్‌) నిధి, ఉద్యోగుల వైద్య‌ప‌రీక్ష‌లతోపాటు ప్ర‌తి ఒక్క ఉద్యోగి హెల్త్ ప్రొఫైల్ ప‌క్కాగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఎస్వీబీసీలో ప్ర‌సారం చేసిన అదివో అల్ల‌దివో కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను చూర‌గొనేలా ఉంద‌ని, ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని రూపొందించాల‌ని సూచించారు. పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, అగ‌ర‌బ‌త్తులకు క్ర‌మేణా డిమాండ్ పెరుగుతోంద‌ని అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి రెండో యూనిట్‌ను సిద్ధం చేయాల‌న్నారు. ఎన‌ర్జీ మీట‌ర్ల ఏర్పాటు, బ‌యోగ్యాస్‌, ఫీడ్‌మిక్సింగ్ ప్లాంట్‌, నోడ‌ల్ గోశాల‌ల ఏర్పాటు, దేశ‌వాళీ ఆవుల పిండ‌మార్పిడి, విద్యుత్ బ‌స్సులు, టిటిడి క‌ళాశాల‌ల‌కు న్యాక్ గుర్తింపు కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వివ‌రించారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావుతోపాటు వివిధ విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

—————————————————
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.