SRI VENKATESWARA ANNAPRASADAM-AKSHAYAPATRA FOR MILLIONS OF DEVOTEES _ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ

Tirumala,17 September 2022: The Annaprasadam Wing of TTD has been serving free food to tens of thousands of visiting pilgrims every day for the past three and a half decades and is considered the most significant charity by the temple management.

TARIGONDA VENGAMAMBA PIONEERED ANNADANAM 

The saga of Annaprasadam has been continuing its unstoppable journey since 1985 irrespective of the flow and hours of devotees at the hill shrine. However, the credit goes to the great Telugu Saint Poetess of the 18th Century, Matrusri Tarigonda Vengamamba who pioneered Annaprasadam in Tirumala by serving free food as a hunger relief to devotees who came to Srivari temple nestled in thick forests about three centuries ago.

Legends speak that she used to organise drinking water and Anna Prasadam distribution during the Sri Narasimha Jayanti festival in the Vaishaka month at Tirumala for ten days. The edicts speak out on land granted to her by kings from Dindigul to Golconda.

As a tribute to the stellar contribution of Vengamamba, the TTD has named the massive Rs.35crore Annaprasada Bhavan after her as Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) which was opened in 2008 on July 11 by the then Honourable President of India, Smt Pratibha Patil.

With ultra-modern cooking systems and dining halls to accommodate 4000 devotees at a time the MTVAC is serving Annaprasadam to 65000 pilgrims every day and nearly one lakh pilgrims during festive days like Brahmotsavams, Radha Sapthami, Vaikuntha Ekadasi etc.

TRANSFORMATION :

In 1933, when TTD took over the Administration of Srivari temple, it made a small beginning in catering to the hunger needs of devotees with a canteen providing snacks at a fair price. Later in 1965, a canteen was set up at the Mandapam where Akhanda Harinama Sankeertans are held now. In, those days Idli was priced at 10 paise, vada at 15ps, tea and coffee at 25ps and masala dosa at 40ps and meals at ₹1.

From 1970-80 TTD operated Sri Venkateswara Public Canteen (SVPC) in an ANC area. On 1971  March 31, the then CM of united AP Sri K Brahmananda Reddy launched the canteen at SV Rest House. Thereafter a TTD central canteen was opened at RTC bus station between 1981-84 providing plate meals at ₹1.75 and full meals at ₹3. The then TTD EO Sri PVRK Prasad opened up Annaprasada Bhavan providing cost effect meals and special meals at ₹4.50 and daily 5000 meals were sold.

However as daily footfalls to Tirumala galloped, TTD made efforts to provide free Annaprasadam to devotees and in 1985 the then CM of united AP Sri NT Rama Rao launched the limited free Annadanam scheme with a ₹10 lakhs donation by a devotee LV Ramaiah.

As per the scheme free meals tokens were issued to devotees after Srivari darshan. What began with 2000 free meals shot into 14,000 and 20,000. Meals were served to 1000 devotees at a time in two halls and by 2008 the daily number crossed 1 lakh(including compartments and queues). 

ANNA PRASADAM SERVICES IN TIRUMALA

Besides MTVAC, TTD organised cooking at other locations also in Tirumala viz. in Vaikunta queue complex 1,2 and Outside queue lines and Food counters at PAC-2. TTD organised the cooking of Sambar Rice, Upma, Pongal and Pulihora.

Raw material for all preparations is tested at the Tirupati marketing godown before being dispatched to the Anna Prasadam department. Every day 10-12 tonnes of Rice, and 7-8 tonnes of vegetables are being utilised after they are cleaned, cut by Srivari Sevaks and sent to all kitchens. Srivari Sevaks also serve and distribute food to devotees at queue lines and also at MTVAC and food counters across Tirumala.

ANNAPRASADAM FUNDS CROSS 1500 CRORES

Since the funds of the SV Nitya Annaprasadam, Trust has crossed ₹1502 crore and it has become self-reliant now,  TTD has stopped giving grants to Annaprasadam since 2018.

ORGANIC VEGGIES 

To provide tasty and healthy Annaprasadam to the multitude of visiting pilgrims, TTD now intends to provide more nutritious food to devotees with organic vegetables produced from Natural Farming techniques. A meeting was convened with Organic Vegetable Farmers of Rayalaseema Region recently by TTD.

During normal days the MTVAC functions between 9 am to 11 pm while during important festival occasions like Garuda Seva and Vaikuntha Ekadasi,  8 am till 1 am the next day.

AKSHAYA PATRA

With its tireless services, the Annaprasadam wing of TTD is being credited as “Akshaya Patra”-the divine never depleting food supply vessel, serving millions and millions of pilgrim public with delicious food items.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ

– 17వ శతాబ్దంలోనే నాంది పలికిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ

– ప్రతిరోజూ దాదాపు 12 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలు వినియోగం

– అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 17 ; తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి. పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంతదూరం చరిత్రలో ప్రయాణిస్తే… మనకు ముందుగా దొరికే సమాధానం తరిగొండవెంగమాంబ,, అంతకుముందు ఎందరో రాజులు, చక్రవర్తులు, స్వామివారి నైవేద్యానికి భూరివిరాళాలు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే భక్తులకోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది.

17వ శతాబ్దంలోనే నాంది

శ్రీవారి అపరభక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నపసాద వితరణ చేసినట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా వైశాఖమాసంలో తిరుమలలో నృసింహజయంతి జరిపే వెంగమాంబ పదిరోజులపాటు అన్నప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటుచేసేవార‌ట‌. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తారాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్టు శాసనాలు తెలుపుతున్నాయి.

అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో ఒకేసారి 4 వేల మందికి భోజ‌నం

తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాందిపలికిన తరిగొండ వెంగమాంబ పేరుతో టిటిడి నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జులై 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి శ్రీ‌మ‌తి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు.

గ‌తంలో స్వ‌ల్ప ధ‌ర‌ల‌కు భోజ‌నం

ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత స్వల్పధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామసంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇడ్లీ 10పైసలు, వడ 15 పైసలు, టీ, కాఫీలు 25పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయిపావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980వరకు ఏఎన్‌సి ప్రాంతంలోని ఓ కాటేజీలో ఎస్వీసీసీ పేరుతో అంటే శ్రీవేంకటేశ్వర క్యాంటీన్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్పధరలకే ఆహారపదార్థాలు విక్రయించేవారు.

తదుపరి 1971లో ప్రముఖులు, భక్తులకోసం మార్చి 31, 1971లో ఎస్వీ గెస్ట్‌ హౌస్‌ను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో టిటిడి ప్రత్యేకంగా క్యాంటీన్‌ను
ఏర్పాటుచేసి తక్కువ ధరలకు అల్పాహారాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకే భోజన సదుపాయాన్నీ కల్పించింది. తదుపరి 1981 నుంచి 1984వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోని టీటీడీ సెంట్రల్‌ క్యాంటీన్‌ ఏర్పాటుచేసి ప్లేట్‌మీల్స్‌ రూపాయి 75పైసలకు, ఫుల్‌మీల్స్‌ మూడు రూపాయలకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్‌ 5వ తేదీన అప్పటి ఇఓ శ్రీ పీవీఆర్‌కె ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్‌ మీల్స్‌ రూపాయి 75 పైసలు, ఫుల్‌మీల్స్‌ మూడురూపాయలు, స్పెషల్‌ భోజనం 4.50 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం ఐదువేల భోజనాలను విక్రయించేవారు.

1985లో రూ.10 లక్షలతో అన్నప్రసాద వితరణ ప్రారంభం

అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టిటిడి శ్రీకారం చుట్టింది. 1985లో అప్ప‌టి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన పది లక్షల రూపాయల భూరివిరాళంతో టిటిడి ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచితభోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచితభోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండువేలమందికి మాత్రమే భోజనం అందిస్తుండగా క్రమంగా ఈ సంఖ్య 14 వేలకు, అక్కడ నుంచి 20 వేల మందికి పెరిగింది. ఈ భవనంలో రెండు హాల్స్‌ ఉండటంతో ఒక్కో హాల్‌లో వెయ్యిమంది చొప్పున విడతకు రెండు వేల మంది భోజనం చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతినిత్యం లక్షకు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది.

పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ

తిరుమలలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు చోట్ల అన్నప్రసాదాలు త‌యారు చేస్తారు. వెంగ‌మాంబ కాంప్లెక్స్‌లో కూర, చట్నీ, సాంబార్, రసం, మ‌జ్జిగ‌, చక్కెర పొంగలి అందిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1, 2, వెలుపలి క్యూలైన్లు, పిఏసి-2, ఫుడ్ కౌంట‌ర్ల‌లో సాంబార్ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. తిరుప‌తిలోని మార్కెటింగ్ గోడౌన్ నుండి ప్ర‌యోగ‌శాల‌లో ప‌రిశీలించిన త‌రువాత అన్న‌ప్ర‌సాద విభాగానికి స‌రుకుల‌ను చేర‌వేస్తారు. అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 టన్నుల బియ్యం, 7 నుండి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ఇక్క‌డ శ్రీవారి సేవకులు కూరగాయల త‌ర‌గ‌డం, సరుకులను శుభ్రం చేయడం, యాత్రికులకు ఆహారం అందించడం త‌దిత‌ర సేవ‌లు అందిస్తున్నారు.

అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులు

ప్ర‌స్తుతం సాధార‌ణ రోజుల్లో రోజుకు 55 వేల నుండి 60 వేల మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ర‌ద్దీ రోజుల్లో ఈ సంఖ్య ల‌క్ష వ‌ర‌కు చేరుతుంది. అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులున్నాయి. 2018వ సంవ‌త్స‌రంలో ఈ ట్ర‌స్టు స్వ‌యంస‌మృద్ధి సాధించ‌డంతో టిటిడి గ్రాంటు ఆగిపోయింది. భ‌క్తుల‌కు మ‌రింత పోష‌కాల‌తో కూడిన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు భ‌విష్య‌త్తులో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన కూర‌గాయ‌లు అందించాల‌ని దాత‌ల‌ను టిటిడి కోరుతోంది. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

ఈ విధంగా అడిగిన వారికి లేద‌న‌కుండా అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న టిటిడి అన్న‌పూర్ణ‌గా ఖ్యాతిగ‌డిస్తోంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులకు అక్షయపాత్రగా నిలుస్తోంది. అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌లో ఇత‌ర ధార్మిక సంస్థ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.