SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS AT NELLORE FROM AUGUST 16-20 _ ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

* REPLICA OF SRIVARI TEMPLE AT NELLORE AC SUBBA REDDY STADIUM

 

 

* LIVE TELECAST BY SVBC

 

 

Tirupati, 13 August 2022: After a break of two and half years of Pandemic corona TTD has revived the Sri Venkateswara Vaibhavotsavas beginning from August 16 and concluding on August 20 at Nellore.

 

With the objective is to showcase the daily Kainkaryams that are being performed at Srivari temple for the benefit of devotees at their home places, TTD is set to conduct the fete at the AC Subba Reddy stadium in Sri Potti Sriramulu Nellore District in a big manner

 

Following is the schedule of programs 

 

NITYA KAINKARYAMS

 

 

Suprabatam, Tomala Seva. Koluvu, Archana, Nivedana, Sattumora, Pratyeka sevas, second nivedana.

 

Sarva Darshan for devotees from 10am to 5pm.

 

In the evening Sahasra Deepalankara seva, Veedhi Utsavam, Night Kainkaryams and Ekantha Seva

 

SPECIAL SEVAS

 

 

The special sevas include Astadala pada Padmaradhana, Vasantotsavam on August 16, Sahasra Kalashabhisekam on August 17, Tiruppavada Seva on August 18, Abhisekam on August 19, Pushpa Yagam on August 20 and Srinivasa Kalyanam on the same day evening.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

తిరుమల తరహాలో నమూనా ఆలయంలో శ్రీవారి సేవల నిర్వహణ

ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు

తిరుపతి, 2022, ఆగస్టు 13: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునఃప్రారంభించనుంది. నెల్లూరులోని ఎసి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో రోజువారీ కార్యక్రమాల సరళి ఇలా ఉంటుంది.

నిత్య కైంకర్యాలు

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

ప్రత్యేక సేవలు

ప్రత్యేక సేవల్లో భాగంగా ఆగస్టు 16న అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, ఆగస్టు 17న సహస్రకలశాభిషేకం, ఆగస్టు 18న తిరుప్పావడ, ఆగస్టు 19న అభిషేకం, ఆగస్టు 20న ఉదయం పుష్పయాగం, సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.