SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS OFF TO A RELIGIOUS START _ హైదరాబాద్ లో వైభవంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభం

ASTADALA PADAPADMARADHANA AND VASANTHOTSAVAM ALLURES DEVOTEES

 

HYDERABAD, 11 OCTOBER 2022: The five-day Sri Venkateswara Vaibhavotsavams(SVV) off to a religious start in Hyderabad on Tuesday with the participation of scores of devotees.

 

To enable the devotees who could not witness the daily sevas in Tirumala temple, TTD has designed an innovative programme Sri Venkateswara Vaibhavotsavams almost a decade ago which was stalled in the last two years due to Covid pandemic.

 

Resuming the fete, TTD has already performed the SVV in a big way at Sri Potti Sriramulu Nellore District and now observing in Hyderabad in the state of Telangana.

 

On the first day, the daily kainkaryams commenced with Suprabhatam, the awakening seva of Lord at 6am followed by Tomala seva-decoration of the presiding deity with colourful garlands and Tulasimalas, which was succeeded by the temple court Koluvu between 6.30am and 7.30am. However, in the evening the Tomala Seva will be observed in Ekantam.

 

 

After decking up the presiding deity, Archana-puja was performed reciting the 1000 sacred names of Lord which included Sahasranama, Astottara Satanama, Chaturvimsatinama, Dwadasanama which was performed between 7.30am and 8.15am.

 

Later it was followed by Nivedana and Sattumora between 8.15am and 8.30am. Usually after performing Archana to Mulamurthi, Prasadams including Laddus, Vadas, Curd Rice, Tamarind Rice, Pongal will be offered to Lord.  During this time Sri Vaishnava Acharyas will recite Divya Prabandam which is known as Sattumora.

 

ASTADALA PADA PADMARADHANA SEVA AND VASANTHOTSAVAM CAPTIVATES DEVOTEES IN DEVOTION

 

Among the daily sevas that are being rendered to the presiding deity of Sri Venkateswara Swamy at Tirumala, Astadala Pada Padmaradhana Seva is observed on every Tuesday.

 

Replicating the same, the special seva to the Mula Virat was performed offering 108 lotuses chanting the 108 divine names of Srivaru on Tuesday which was witnessed with utmost devotion by the devotees who thronged the NTR Stadium in Hyderabad. This was later followed by Vasanthotsavam.

     

Vasanthotsavam is an annual fete performed during the spring season in Tirumala. The utsava deities of Sri Malayappa, Sridevi and Bhudevi were rendered Snapana Tirumanjanam with milk, curd, honey, coconut water, turmeric, sandal paste after performing Viswaksena Aradhana, Punyahavachanam and Kalasaradhana. While performing the Abhishekam, the Vedic Pundits recited Taittariya Upanishad, Purusha Sooktam, Sri Sooktam, Bhu Sooktam, Neela Sooktam, Panchashanti Mantrams, Divyprabandham.

 

Annamacharya Project, Senior Artist, Sri B Raghunath and his team presented a series of Annamacharya Sankeertans on the occasion.     

 

One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu, Donors Sri Harshavardhan, Sri SS Reddy, Sri Venkateswar Reddy, Sri Subba Reddy,  SE Electrical Sri Venkateswarulu, AEOs Sri Parthasaradhi, Sri Sriramulu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హైదరాబాద్ లో వైభవంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభం
 
– శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం సేవలకు అపూర్వ స్పందన
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 11: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించే విధంగా హైదరాబాద్ లో 5 రోజుల పాటు తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో కైంకర్యాలను పూర్తి చేయనున్నారు.
 
సుప్రభాతం : ఉదయం 6 గంటలకు :
 
తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును వేదపండితులతోనూ, భక్తజనులతోనూ, ఆధ్యాత్మికతత్త్వ విశారదులతోనూ, పాచక-పరిచారక-అధికారులతోనూ, అర్చక స్వాములు పరిశుద్ధాంతఃకరణులై మంత్ర సహితముగ జయవిజయుల అనుజ్ఞతో- 
 
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
 
– అనే సుప్రభాత శ్లోకాన్ని పఠించి ద్వారాలు తెరచి లోపలికి ప్రవేశించి, భగవంతుణ్ణి ధ్యానించి, విశేష ఉపచారాలను, నవనీతమును నైవేద్యం చేసి సేవిస్తారు. దీనిని ‘సుప్రభాత సేవ’ అంటారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులు ఒకరు ”మేలుకో శృంగార రాయ…..” అంటూ మేల్కొల్పులు పాడతారు. 
 
తోమాలసేవ, కొలువు : ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు : 
 
తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను, ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్నే తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని  ”తోమాల” అంటారు. తొడుత్తమాలై అనే తమిళ పదంతో వచ్చిన మాట ‘తోళ్‌మాల’. తొడుత్తమాల అంటే పై నుంచి క్రిందకు వేలాడు మాల అని అర్థంలో తోళ్‌ మాలై అని పేరు వచ్చింది.
 
అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొనడానికి వీలు లేదు. ఏకాంగి కాని లేదా జియ్యంగార్లు పూల అర నుంచి సిద్ధం చేసిన పూలమాలలను తీసికొచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు 30 నిమిషాలసేపు జరుగుతుంది. 
 
తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి కొలువు జరుగుతుంది. ఆ సమయంలో ఆనాటి తిథి నక్షత్రాది వివరాలతో పంచాంగ శ్రవణం జరిగిన తరువాత ముందురోజు హుండీ ఆదాయ వ్యయాలు, అన్నదాతల పేర్లు అన్నింటినీ స్వామివారికి నివేదిస్తారు. 
 
అర్చన : ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు 
 
భగవత్‌శక్తి దినదినాభివృద్ది కావడానికి  చేసే ప్రధాన ప్రక్రియ ఆగమశాస్త్రోక్త ‘అర్చన’. ఈ అర్చనలో ఆవాహనాదిగా అనేక ఉపచారములు చోటు చేసుకుంటాయి. అనేక మంగళకరములైన ఓషధి ద్రవ్యములతోనూ, అనేక పుష్పములతోనూ, తులసి మొదలగు పత్రములతోనూ ఈ అర్చన జరుపబడుతుంది. ధ్రువాది పంచమూర్తులకు, పరిషద్దేవతాగణాలకు, లోకపాల-అనపాయిను లకు ఈ అర్చన జరుపబడుతుంది. ఈ అర్చనల్లో సహస్రనామాలతో, అష్ణోత్తరనామాలతో, కేశవాది ద్వాదశ నామాలతో పూజ జరుప బడుతుంది. పురాణంలో చెప్పబడ్డ శ్రీవేంకటేశ్వర సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళి, లక్ష్మీచతుర్వింశతి నామావళితో ప్రతి నిత్యం అర్చన జరుగుతుంది. ఈ అర్చన లోకక్షేమార్థం, సర్వజన సుభిక్షార్థం, సమస్త సన్మంగళావాప్త్యర్థం జరుపబడుతుంది. 
 
నివేదన, శాత్తుమొర : ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు
 
అర్చన తరువాత గర్భాలయంలో శ్రీస్వామివారికి, ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డూలు, వడలు, దధ్యోదనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట, మధ్యాహ్నం నివేదనను రెండవ గంట, రాత్రి నివేదనను మూడవ గంట లేదా రాత్రి గంట అంటారు.
 
నివేదన తరువాత వైష్ణవాచార్య పురుషులు స్వామివారి సన్నిధిలో దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. దీన్నే శాత్తుమొర అంటారు. అనంతరం శ్రీవైష్ణవాచార్యులందరూ రామానుజులకు నివేదన అయిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
 
శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం సేవలకు అపూర్వ స్పందన
 
శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శ్రీవారి నమూనా ఆలయంలో మొదటి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనసేవ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు వేడుకగా జరిగింది. అష్టదళాలతో కూడిన108 బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదళ పాదపద్మారాధన. ఇందులో భాగంగా బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. 
 
వసంతోత్సవం – వైభవంగా స్నపనతిరుమంజనం
 
ఉదయం 10 నుండి 11 గంటల వరకు వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కలశారాధన నిర్వహించారు. అనంతరం అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులకు వసంతాలు చల్లారు. 
 
సాంస్కృతిక కార్యక్రమాలు
 
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం పలు అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు. 
 
ఈ కార్యక్రమంలో దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, ఏఇఓలు శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.