SRIMAD RAMAYANAM DANCE BALLET ALLURES DEVOTEES _ రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజనసంగీతం, నృత్యం

Vontimitta, 05 April 2023: The outstanding dance ballet on Sri Rama Pattabhishekam by the student’s of TTD’s College of Music and Dance received overwhelming response from the devotees who thronged to witness the Sita Rama Kalyanam at Vontimitta on Wednesday.

The dance ballet comprised Sita Swayamvaram, Vanavasam, Ravana Samharam and Pattabhishekam episodes with 38 students donning various characters in Srimad Ramayanam.

Before the commencement of Sita Rama Kalyanam, the students enacted the dance ballet which lasted for over an hour and allured the devotees.

The Dance ballet was choreographed by Dr Usharani, under the supervision of Dr Uma Muddubala, the Principal of College.

Earlier bhajana programme by the students and faculty of the music and dance college also immersed the devotees in devotional waves.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజనసంగీతం, నృత్యం

– వీనులవిందుగా సాగిన శ్రీరామ నామామృతం భజన

– మైమరపింపచేసిన శ్రీరామకృతులు నృత్యం

ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి.

 సాయంత్రం 4 గంటల నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకులు శ్రీ వైఎల్.శ్రీనివాసులు బృందం నాద‌స్వ‌రం-డోలు వాద్యం మంగళప్రదంగా ప్రారంభమైంది. ఆ తరువాత ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి 40 మంది శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు. భజన సంప్రదాయంలో ఆలపించిన కీర్తనలకు పలువురు భక్తులు గొంతు కలిపి నృత్యం చేశారు.

గణేశ శరణం శరణం గణేశా…, రామ రామ రామ రామ రామ నామ తారకం…., రామ రామ జయ రాజరాం…., రామకోదండ రామ రామ కల్యాణ రామ…., రామ రామ దశరధ రామ…., రామ రామయనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా…., రామచంద్ర రఘువీరా రామచంద్ర రణధీర…., దశరథనందన రామ్ దయాసాగర రామ్…, రామజయం శ్రీరామజయం….., రామ రామ రాం రాం రాం…., కృష్ణ రామ గోవింద నారాయణ…., రామ రామ శ్రీరామ రామయని – రయమున పాడేదెన్నటికో….తదితర భజన కీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి.

అనంతరం ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో శ్రీరామకృతులు నృత్యం మైమరపింపచేసింది. ఇందులో శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకంలోని అంశాలను నృత్య రూపంలో చక్కగా ప్రదర్శించారు.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల, కళాకారులు శ్రీమతి బుల్లెమ్మ, డాక్టర్ వందన, శ్రీమతి చిన్నమదేవి, శ్రీ అనంతకృష్ణ, శ్రీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.