SRIMANNARAYANEYA SHASRA GALARCHANA HELD _ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన

Tirumala, 23 November 2024: The Tirumala hill shrine resounded on Saturday with the Srimannarayaniyam Sahasra Galarchana-a non-stop program conducted by the Srimannarayana Bhakta team at Asthana Mandapam in Tirumala for 8 and half hours from 10.30am to 6.00 pm.

The Srimannarayaniyam comprising of 1036 shlokas is a popular morning daily recitation in the state of Kerala and Tamil Nadu

For the first time in Telugu states, this devotional recital was arranged at Tirumala wherein over 1200 Sadhakas participated. 

The teams of Agrepasyami and Sandrayanam have been conducting training programs for this recitation for the past two years. 

All the trained devotees of Srimannarayaniya Parayanam participated in the Galarchana held at Tirumala and recited Nrisimha Bhajan, Hanumanchalisa, Jayajanardana Bhajan, Govindanamalu, Rathebhajana and Pancharatna Stotras.

Additional EO of TTD  Sri Ch Venkaiah Chaudhary who was the chief guest for this program said that he was immensely happy to participate in Srimannarayaneya Sahasra Galarchana. 

He congratulated Smt Aruna, Electrical DE Sri Chandra Shekhar, for the successful conduction of the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన

భ‌క్తుల స్తోత్ర స‌మ‌ర్ప‌ణ‌తో పులకించిన సప్తగిరులు

తిరుమల, 2024 నవంబరు 23: తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన శ్రీ‌మ‌న్నారాయణీయం సహస్ర‌ గళార్చన కార్య‌క్ర‌మంతో స‌ప్త‌గిరులు పుల‌కించాయి. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం ఆర గంటల వరకు నిరాటకంగా కొనసాగింది.

1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోనూ ఈ పారాయణ చేస్తోన్న భక్తులు అనేకమంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200 మందికి పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేశారు. అగ్రేపశ్యామి, సాంద్రాయనం బృందాలు గత రెండేళ్లుగా ఈ పారాయణంపై సాధకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. శ్రీమన్నారాయణీయ పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలో గళార్చనలో పాల్గొని నృసింహ భజన, హనుమాన్‌చాలీసా, జయజనార్దన భజన, గోవిందనామాలు, రాథేభజన, పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు.

టీటీడీ అడిషినల్‌ ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హిండ‌చం సాధార‌ణ విష‌యం కాద‌ని, ఇందుకు కృషి చేసిన శ్రీ‌మ‌తి అరుణ‌, టీటీడీ డిఈ శ్రీ చంద్ర శేఖ‌ర్ ల‌ను అభినందించారు. మ‌నుషుల‌కు మాన‌సిక దృఢ‌త్వం చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ఇలాంటి సామూహిక పారాయ‌ణం వ‌ల్ల మ‌న‌కు మాన‌సిక దృఢ‌త్వం ఏర్ప‌డుతుంద‌ని తెలియ‌జేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.