SRINIVASA KALYANAM _ ప్రజలలో దైవభక్తి పెంపొందించడానికి కృషి : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ  ఎల్‌.వి. సుబ్రమణ్యం

Tiruchi, June 26, 2011: Sri L.V.Subramanyam, Executive Officer has taken part in the celestial wedding of Sri Lord Venkateswara at Tiruchi in Tamil Nadu on June 26, 2011. Addressing the huge gathering the EO said that The Tirumala Tirupati Devasthanam has been conducting such Srinivasa Kalyanam’s since 2007 in all premier towns and cities of the country with a mission to facilitate the divine darshan and all pervading blessings of Lord Venkateswara on all. He said that The very purpose of Srinivasa Kalyanam is

·         To promote Sanata Dharma among all sections of society

·         To conduct  the rituals  in the same procedures as at Srivari Temple at Tirumala

·         To provide the opportunity to poor, sick and physically challenged persons who can not visit Tirumala.

·         To spread the glory and holiness of darshan of Lord Venkateswara among devotees.

As part of its mission to promote Hindu Dharma the TTD has taken up conduction of Govinda Kalyanams for benefit of tribals living in remote tribal and hilly areas. During such ceremonies the TTD also conducted medical camps providing free health checkups, free medicines and consultations to the sick tribals besides providing them devotional literature. So far  TTD has conducted   Srinivasa Kalyanams in nearly 80 towns and cities of the country including national capital and metros he added.

Further he said The TTD has also launched the ‘Lok Kalyana raths’ to all nook and corners of the country to provide the devotees an opportunity to view the daily rituals at the Srivari Temple as they were performed at Srivari Temple in Tirumala

 He told a good news for the devotees of Tamil Nadu that The TTD is making all out efforts to launch the Tamil Channel of Sri Venkateswara Bhakti Channel (SVBC)  in time in a few months to reach the message of Bhakti and Lord Venkateswara’s message in their local language up to their  doorstep.  He is confident that the Tamil channel will also get the same level of support and patronage of its sister channel in Telugu (SVBC-Telugu) by all the devotees of Lord Venkateshwara.

Later the Temple priests of Lord Venkateswara performed the celestial wedding of Lord Perumal with religious fervor.

He thanked Sri Ranga Seva Trust, the organizers of the Srinivasa Kalyanam in Tiruchi for making the celestial wedding a grand success.

Prof. Kasi Venkat Reddy, Secretary HDPP,Sri E.Ma.Masanamuthu, I.P.S. Commissioner of Police (I.G), Tiruchy and large number of devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, camp in Tiruchi
 
 
ప్రజలలో దైవభక్తి పెంపొందించడానికి కృషి : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ  ఎల్‌.వి. సుబ్రమణ్యం

తిరుపతి, జూన్‌ 26, 2011: ప్రజలలో దైవభక్తిని, సేవాతత్పరతను, సనాతన ధర్మం పట్ల మక్కువ, గౌరవం పెంపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం కృషి చేస్తున్నదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం చెప్పారు. ఆదివారం సాయంత్రం తమిళనాడులోని తిరుచ్చినగరంలో నేషనల్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవములో పాల్గొనలేని లక్షలాది మంది భక్తుల కొరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.  
ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇప్పటికే 80 చోట్ల శ్రీనివాస కల్యాణాలు నిర్వహించడం జరిగిందని, తద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని కనులారా దర్శించి పారవశ్యం పొందారని ఆయన అన్నారు. అదేవిధంగా మారుమూల గిరిజన ప్రాంతాలలోను శ్రీవారి గోవిందకల్యాణాలు నిర్వహిస్తూ  మారుమూల ప్రాంతాలలోని ప్రజల చెంత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలను భక్తుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా లోకకల్యాణ రథాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో ఈ రథాలు ప్రయాణం చేస్తూ భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించుటయే కాకుండా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నామని ఇఓ అన్నారు.
 
తితిదే ఒకవైపు తిరుమలకు వచ్చే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడమే కాకుండా భక్తి, ధార్మిక, సామాజికహిత కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల సమాచారాన్ని, స్వామివారి వైభవాన్ని, ధార్మిక ప్రచారానికి ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేసే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానాల్‌ తెలుగులో భాగా ప్రచారాన్ని నోచుకున్న తరువాత తమిళంలో కూడా ప్రసారాలను ప్రారంభించడానికి తితిదే కృషి చేస్తుందని ఇఓ అన్నారు. అనంతరం తిరుమల  నుండి విచ్చేసిన అర్చక స్వాములు, వేదపండితులు శ్రీవారి కల్యాణాన్ని లక్షలాది మంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి కసిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎస్‌.పి., ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, శ్రీరంగసేవాట్రస్టు సభ్యులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.