SRINIVASA KALYANAM HELD AT SAN FRANCISCO _ అమెరికాలో ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు

SRINIVASA KALYANAM HELD AT SAN FRANCISCO

NRI DEVOTEES RELISH THE DIVINE WEDDING

TTD CHAIRMAN PARTICIPATES

TIRUMALA, 19 JUNE 2022:  TTD along with AP Non-resident Telugu Society organized its first Srinivasa Kalyanam at San Francisco, Bay Area in the United States which was attended by TTD Chairman Sri YV Subba Reddy.

The celestial wedding took place in the Indian Community Centre here which was attended by scores of devotees. As per the Indian Standard Time, the event took place during the wee hours on Sunday.

In the following order, the celestial event was conducted by Archakas amidst the chanting of Vedic mantras.

Punahavachanam: This is a sanctifying ritual conducted to cleanse all the articles, and premises before the commencement of the celestial marriage.

Vishwaksena Aradhana: Lord Vishwaksena happens to be the Commander-in-Chief of Lord Venkateswara who supervises the ritual and hence His blessings were invoked.

The purified water in the Kalasam is sprinkled on all the articles in Homakundam and Mantapam.

Ankurarpana: Next followed Ankurarpana which signifies a healthy beginning before any ritual. The Asta Dikpalakas were invoked and worshiped in this ritual.

Pratisara Bandhana: This is yet another main part of the celestial wedding where the sacred Kankanams (holy threads) are tied to the right hand of the Lord and left hand of His Consorts while the ritual-performing priests tie it to their right hands only. Swasti Sooktam was recited.

Agni Pratishta: Then followed Agni Pratista where the pious Agni was lit and Prayaschitta Homam was performed.

Vastra Samarpana: After the Agni Pratistha new set of silk vastrams were offered to deities.

Maha Sankalpam: Then the important phase of the ritual, Maha Sankalpam was performed where in the descendent of the Tallapaka family (the family which dedicated their lives in the service of Lord Venkateswara for the last 600 years) performed Kanyadanam on behalf of Goddesses.

Kanyadanam: In any Hindu Marriage, Kanyadanam occupies a prominent place. Here the Gotra Pravaras of Lord and His Consorts were recited by the priests

Bharadwaja Gotram – Lord Venakteswa

Bhargava Gotram     – Goddess Sri Devi

Kasyapa Gotram       – Goddess Bhu Devi

Mangalya Dharana Mahotsavam: The Divine Wedding Ceremony came to a grand end with, Mangalya Dharana where Lord Venkateswara tied the Holy Mangala Sutrams to His beloved Consorts.

Varana Mayiram: This is a prominent and most entertaining phase usually performed during South Indian Hindu Weddings. The Lord and His Consorts played with floral balls and coconuts facing each other. (Here the priests and Tallapaka descendent performed this ritual on behalf of the deities). After this, the garlands of deities were also exchanged.

Aarti: After the conclusion of the pleasant “Love Game”, the Consorts were seated on either side of the Lord, with Sridevi taking the Right side and Bhudevi occupying the left place of Maha Simhasanam.

Finally, Karpoora Aarati, Nakshatra Aarati, and Maha Aarti were rendered marking the grand conclusion of the Celestial Wedding Ceremony.

Sri YV Subba Reddy along with his wife Smt Swarnalatha, AP NRT Chairman Shri Medapati Venka, SVBC board Director Damarukam Srinivasa Reddy, Rathnakar Pandugayala- USA Special Representative, Sridhar Korsapati- NATA President and others were also present.

The devotees cherished every moment with religious ecstasy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అమెరికాలో ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు

శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుల పండువగా శ్రీనివాస కళ్యాణం

పాల్గొన్న టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల, 2022 జూన్ 19 ; అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవ క్రతువు ఇలా సాగింది.

పుణ్యాహవాచనం;కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ.

విశ్వక్సేన ఆరాధన:విశ్వక్సేనుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ముందు ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తారు.

శుద్ధి;కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లుతారు.

అంకురార్పణ:అంకురార్పణ ఏదైనా పుణ్య కార్యానికి ముందు నిర్వహించే వైదిక క్రతువు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు.

ప్రతిష్టా బంధన:కల్యాణం లో ఇది మరొక ప్రధాన భాగం. అర్చకులు పవిత్రమైన కంకణాలను (పవిత్ర దారాలు) స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల చేతులకు కడతారు.

అగ్ని ప్రతిష్ట:పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు.

వస్త్ర సమర్పణ:అగ్నిప్రతిష్ఠానంతరం దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు.

మహా సంకల్పం:తాళ్లపాక వంశస్థులు (గత 600 సంవత్సరాల నుండి వేంకటేశ్వరుని సేవలో తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం) అమ్మవారి తరపున కన్యాదానం చేసే ఆచారం ఇది. ఇందుకోసం మహా సంకల్పం జరిగింది.

కన్యాదానం:కళ్యాణంలో, కన్యాదానానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ భగవంతుడు మరియు అతని భార్యల గోత్ర ప్రవరాలను పూజారులు పఠించారు.

మహోత్సవం:వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

వారణమాయిరం:ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన, వినోదాత్మకమైన క్రతువు. ఇందులో స్వామివారు అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు మరియు కొబ్బరికాయలతో ఆడుకున్నారు. (ఇక్కడ దేవతల తరపున పూజారులు మరియు తాళ్లపాక వంశస్థులు ఈ ఆచారాన్ని నిర్వహించారు). అనంతరం దేవతామూర్తులకు పూలమాలలు మార్చుకున్నారు.

హారతి:శ్రీదేవి కుడి వైపున, భూదేవి ఎడమ వైపున కూర్చున్నారు. చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో కళ్యాణోత్సవం ముగిసింది.

శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.

కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.