SRINIVASA KALYANAMS FROM MARCH 15 AT CHITTOOR AND GUNTUR DISTS_ మార్చి 15 నుండి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 14 Mar. 19: TTD plans to roll out prestigious and celestial event of Srinivasa Kalyanams at eight locations in the two premier districts of Chittoor and Guntur from March 15 onwards.

In Chittor district the Srinivasa Kalyanams will be held at March 15 at Shiva kurbur village of Shantupuram mandal March 16 at Govt degree college of Palamner town

IN GUNTUR DIST

March 20 at SRI Bala Ankam thalli temple premises of Munugodu village of Amaravati mandal.

March 21: Sri Venkeswara temple of Peddapalysm village inAchampeta mandal

March 22: SRI Naga Kalika maya temple of Garikapadu village of Kosuru mandal
March 23: KSP stadium, STC Road, Narasaraopeta town

March 24: Sharabhaiah High School, Sattenapalli
March 25: Sri Ramalayam of Manne Sultanpalyam village in Bellamkonda mandal.

TTD is conducting the sacred event of Srinivasa Kalyanam across remote villages and all over the country and abroad to spread the glory of Lord Venkateswara for the benefit of devotees.

All arrangements for the holy event were supervised by Sri Prabhakar Rao.OSD Of Srinivasa Kalyanam project The artists of Annamacharya project would conduct sankeertans and bhajans, kolatas etc at all locations.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 15 నుండి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2019 మార్చి 14: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 15వ‌ నుండి 25వ తేదీ వరకు చిత్తూరు, గుంటూరు జిల్లాలో క‌లిపి 8 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

చిత్తూరు జిల్లాలో ..

– మార్చి 15వ తేదీన శాంతిపురం మండలం శివ‌కురుబూరు గ్రామంలో శ్రీ‌నివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 16న ప‌ల‌మ‌నేరులోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లాలో…

– మార్చి 20న అమ‌రావ‌తి మండ‌ల కేంద్రంలోని మునుగోడు గ్రామంలో గ‌ల శ్రీ బాల అంక‌మ్మ‌త‌ల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 21న అచ్చంపేట మండ‌లం పెద్ద‌పాళెం గ్రామంలోని శ్రీ వేంక‌టేశ్వ‌రాల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం నిర్వ‌హిస్తారు.

– మార్చి 22న క్రొసూరు మండ‌లం గ‌రిక‌పాడు గ్రామంలోని శ్రీ నాగ కాలికామాత ఆల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 23న న‌ర‌స‌రావుపేటలోని ఎస్‌టిపి రోడ్డులో గ‌ల కెఎస్‌పి స్టేడియంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 24న స‌త్తెన‌ప‌ల్లిలోని శ‌ర‌భ‌య్య ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగణంలో శ్రీ‌నివాస కల్యాణం నిర్వ‌హిస్తారు.

– మార్చి 25న బెల్లంకొండ మండ‌లం మ‌న్నె సుల్తాన్‌పాళెం గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

————————————————————–

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.