SRINIVASA KALYANAMS IN OVERSEAS _ నవంబర్ 9 నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు యూరప్ లో శ్రీనివాస కళ్యాణాలు

TIRUPATI, 29 OCTOBER 2024: Sri Srinivasa Kalyanams are scheduled to be performed on a grand scale in 13 cities across 8 countries in the UK, Ireland, and Europe during the months of November and December this year by TTD.

The event organizers Sri Surya Prakash Velaga and Sri Krishna Javaji from Germany, Frankfurt have formally met the TTD EO Sri J Syamala Rao and invited him to participate in the series of celestial marriages.

They told the EO that the preparations are underway to conduct Srinivasa Kalyanams in 13 cities across 8 countries in the UK, Ireland, and Europe from November 9 to December 21 by APNRTS in association with the TTD & local voluntary and cultural organizations in these countries.

TTD Veda Pundits will conduct the rituals according to the Vaikhanasa Agama tradition. Local voluntary, cultural, and religious groups are making all necessary arrangements to facilitate the events.

Schedule of Srinivasa Kalyanams in the UK, Ireland, and Europe:
•⁠ ⁠Belfast, Ireland – November 09
•⁠ ⁠Dublin, Ireland – November 10
•⁠ ⁠Basingstoke, UK – November 16
•⁠ ⁠Eindhoven, Netherlands – November 17
•⁠ ⁠Hamburg, Germany – November 23
•⁠ ⁠Paris, France – November 24
•⁠ ⁠Warsaw, Poland – November 30
•⁠ ⁠Stockholm, Sweden – December 01
•⁠ ⁠Milton Keynes, UK – December 07
•⁠ ⁠Gloucester, UK – December 08
•⁠ ⁠Frankfurt, Germany – December 14
•⁠ ⁠Berlin, Germany – December 15
•⁠ ⁠Zurich, Switzerland – December 21

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబర్ 9 నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు యూరప్ లో శ్రీనివాస కళ్యాణాలు

తిరుపతి, 2024 అక్టోబ‌రు 29: టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ సూర్య ప్రకాష్ వెలగా మరియు శ్రీ కృష్ణ జవాజీ జర్మనీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుండి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావును మంగళవారం ఉదయం తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

అనంతరం వారు యూకే, ఐర్లాండ్‌, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ ఆర్ టీ ఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు తెలిపారు.

కాగా ఈ తిరు కళ్యాణ కార్యక్రమాలని టీటీడీ వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు.

యూకే, ఐర్లాండ్ మరియు ఐరోపాలలో శ్రీనివాస కళ్యాణాల వివరాలు:

• నవంబర్ 9 – బెల్ఫాస్ట్, ఐర్లాండ్

• నవంబర్ 10- డబ్లిన్, ఐర్లాండ్

• నవంబర్ 16- బేసింగ్‌స్టోక్, యూకే

• నవంబర్ 17 – ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్

• నవంబర్ 23- హాంబర్గ్, జర్మనీ

• నవంబర్ 24 – పారిస్, ఫ్రాన్స్

• నవంబర్ 30- వార్సా – పోలాండ్ –

• డిసెంబర్ 1 – స్టాక్‌హోమ్, స్వీడన్ –

•⁠ ⁠మిల్టన్ కీన్స్, యూకే – 7వ డిసెంబర్ 2024

• డిసెంబర్ 8 – గ్లౌసెస్టర్, యూకే.

• డిసెంబర్ 14 – ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ

• డిసెంబర్ 15- బెర్లిన్, జర్మనీ

• డిసెంబర్ 21. – జ్యూరిచ్, స్విట్జర్లాండ్

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.