SRINIVASA MANGAPURAM TEMPLE EMERGING AS MOST SOUGHT AFTER LORD AFTER TIRUMALA_ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాభివృద్ధికి కృషి : టిటిడి ఈవో

Srinivasa Mangapuram, 02 November 2018 : Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram, about 15km, from Tirupati, is emerging fast as most sought after deity after Tirumala.

The daily footfall to this temple is 3000 while Saturdays the number is aggregated at 5000. While the hundi collections is standing at Rs.30 lakhs per month taking the annual revenue figures to 3.5cores in this temple which is under the control of Archaeological Survey of India(ASI).

Already Rs.7cr has been spent towards the expansion of pushkarini, protective wall and other development works by TTD. Permission is now awaited from ASI to construct Potu, Ugranam, Vahana Mandapam, Yagashala, Dormitory Hall, Office Building etc. at Rs.5crores.

The important significance of this temple is that the unmarried who perform Kalyanotsavam in this temple will soon be blessed in marital bond with the benign blessings of Sri Kalyana Venkateswara Swamy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాభివృద్ధికి కృషి : టిటిడి ఈవో

తిరుమల, 02 నవంబర్‌ 2018: విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారత పురావస్తు శాఖవారి అనుమతి వచ్చాక ఆలయంలో నూతనంగా పోటు, ఉగ్రాణం, వాహన మండపం, యాగశాల, కల్యాణమండపం విస్తరణ, డార్మెటరీ హాలు, నూతన కార్యాలయ భవనం తదితర అభివృద్ధి పనులను రూ.5 కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, తిరుమలకు వెళ్లలేని భక్తుల కోసం శ్రీవారు ఇక్కడ అర్చావతారమూర్తిగా దర్శనమిస్తున్నారు. తిరుపతి నుండి దాదాపు 12 కి.మీ దూరంలో గల ఈ ఆలయానికి ఆర్‌టిసి బస్సు సౌకర్యం ఉంది. యువతీ, యువకులు ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని కంకణం ధరిస్తే దోషాలు తొలగి వివాహ శుభఘడియలు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 8 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నెలకు సుమారు రూ.30 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది. ఆర్జిత సేవల నిర్వహణ ద్వారా నెలకు సుమారు రూ.20 లక్షలు లభిస్తోంది. రూ.3.90 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, రూ.47 లక్షలతో ఆలయ పుష్కరిణి విస్తరణ తదితర అన్ని అభివృద్ధి పనులను రూ.7 కోట్లతో పూర్తి చేశారు. ప్రతి ఏడాదీ రూ.88 లక్షల వ్యయంతో ఆలయంలో చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, పర్వదినాల సమయంలో క్యూలైన్ల ఏర్పాటు తదితర పనులు చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టిటిడి భక్తుల నుండి సలహాలు, సూచనలు కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.