SRIRAMA CORONATION CEREMONY OBSERVED _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
Tirumala, 07 April 2025: The celestial Coronation Ceremony -Sri Rama Pattabhisheka Asthanam was observed with utmost religious fervour in Tirumala temple.
The traditional temple court was held inside Bangaru Vakili on Monday evening between 8pm and 9pm amidst recitation of Pattabhisheka Mahotsavam chapter from Srimad Ramayana by the temple priests in front of Utsava deities of Sri Sita Lakshmana Anjaneya sameta Sri Rama.
Temple staff participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
తిరుమల, 2025 ఏప్రిల్ 07: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
రాత్రి 8 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుగ్రీవుడు, అంగదుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.